ఎన్నిక షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకుంటున్నాయి. ఒకపక్క అభ్యర్థుల ప్రకటన చేస్తూనే.. మరొక పక్క ప్రచారానికి కూడా సిద్ధమయ్యింది అధికార పార్టీ వైసిపి. మరొక పక్క ప్రతిపక్ష పార్టీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా తర్జనబర్జన చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ పార్టీ మేనిఫెస్టో చాలా ఆసక్తికరంగా మారుతోంది. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను దాదాపుగా 99% వరకు అమలు చేశామని అధికార పార్టీ తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ ఎన్నికల కోసం సరికొత్త మ్యానిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.


వైసీపీ మేనిఫెస్టో ఇప్పటికే తొలి దశలోకి వచ్చిందని.. మొదట సిద్ధం సభల వేదికగా మేనిఫెస్టో ఉంటుందని అందరూ అనుకున్నారు అయితే ఆ తర్వాత సీఎం జగన్ ప్రచార సభల నుంచి వచ్చిన తర్వాత పార్టీ మరొకసారి మేనిఫెస్టో పైన.. అందులో ఉండే అంశాల పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైసిపి 2024 మేని పోస్టు ఎలా ఉండబోతోంది గత ఎన్నికలలో మాదిరే నవరత్నాల పేరుతో ఈసారి సంక్షేమ పథకాల పైన ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుగా వైసిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.


ఈసారి నవరత్నాలకు అప్ గ్రేడ్ వర్షన్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వ తాతలు ,యువత, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి మరొకసారి పెద్దపీట వేయబోయే అవకాశం ఉన్నట్లు వైసీపీ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏ రాష్ట్రంలో చేయలేనని సంక్షేమ పథకాలను ఏపీలో ప్రవేశపెట్టడం జరిగింది సీఎం జగన్. గతంలో కంటే ప్రతి విషయంలో కూడా ఈసారి మేనిఫెస్టోలో అధిక లబ్ది కలిగించేలా ఉంటుందని తెలుస్తోంది. వైసిపి మేనిపోస్టు లో పెట్టిన ప్రతి అంశం కూడా నెరవేరుతుందని.. తమ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు సైతం దిమ్మ తిరిగేలా ఉండడం ఖాయమని వైసిపి నేతలు తెలుపుతున్నారు. హామీల అమలు విషయంలో టిడిపి ప్రభుత్వం చాలా వరస్ట్ గా ఉందని కూడా ఎన్నోసార్లు రుజువు అయింది.. ఇప్పటికే టిడిపి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: