దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది..ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ లు వరుసగా విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మేలు చేస్తామో వారి నియోజకవర్గ ప్రజలకు వివరిస్తున్నారు.. గతంలో అధికార పార్టీ తరుపున ఎంపీ గా గెలిచిన లావుకృష్ణ దేవరాయలు ఇటీవల సామజిక సంస్కరణలో భాగంగా ఈ సారి సీటు దక్కక పోవటంతో అధికార పార్టీ అయిన వైసీపికి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలోకి జాయిన్ అయ్యారు. నరసరావుపేట పార్లమెంట్  టీడీపీ జనసేన, భాజపా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు వరుస హామీలు ఇస్తున్నారు.రాబోయే ఐదేళ్లలో పార్లమెంటు పరిధిలో 50 షాదీఖానాలు, ఖబర్‌స్తాన్లు నిర్మాణం చేయిస్తామని నరసరావుపేట పార్లమెంటు తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

సోమవారం పిడుగురాళ్ల పట్టణంలోని తెదేపా కార్యాలయంలో గురజాల నియోజకవర్గంలోని ముస్లిం ఇమామ్‌లు, మౌజన్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్ని మాట్లాడుతూ పౌరసత్వ చట్టం వల్ల ముస్లిం సోదరులకు ఎక్కడా భంగం కలగదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఎక్కడైనా మంచివారు ఉంటారు, మంచి వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 8 మంది పోటీ చేస్తున్నాం, అందరికి మద్దతు ఇచ్చి సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అలాగే గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులు శుభకార్యాలు చేసుకోవటానికి ఇబ్బంది పడుతుంటే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు పిడుగురాళ్ల షాదీఖానా నిర్మాణం చేశామని గుర్తుచేశారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మౌజన్లు, ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు అందజేసి, గృహాలు నిర్మిస్తామని చెప్పారు. సమావేశం అనంతరం కరాలపాడులో రామాలయం ప్రారంభోత్సవానికి ఎంపీ, యరపతినేని వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: