ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం షెడ్యూల్ మాత్రమే వచ్చింది.నోటిఫికేషన్ రావడానికి మరింత సమయం పట్టనుంది. దీనితో అధికార,ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహన్ని రచిస్తున్నాయి. ఇరు పార్టీ అభ్యర్థులు, అధినేతలు ప్రచార కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే  సీఎం జగన్ “మేమంతా సిద్ధం” అంటూ బస్సు యాత్ర చేస్తూ ప్రతిపక్ష కూటమి పై విమర్శలు గుప్పిస్తున్నారు..అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ‘ప్రజా గళం’ పేరిట ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అధికార పార్టీ చేసిన మోసాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా  నెల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. “ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల వస్తాయి. ఇంకా ఎన్నికలే జరగలేదు. కానీ, నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో గెలిచేశారు.. ఇక తెలియాల్సింది..కేవలం ఎంత మెజారిటీతో అనేది మాత్రమే” అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాదు.. ఈ సందర్భంగా నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విజయసాయి రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు.“నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుంటే.. ఆయనపై ఒక అవినీతిపరుడు, ఒక పనికిమాలిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం వంటి వ్యక్తి  అయిన విజయ్ సాయి రెడ్డి పోటీ చేస్తున్నారు.. నిన్ననే చూశాం మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నారు..అమ్మా వెళ్లిపోకండి..భోజనం పెడతాం తినండి అని బ్రతిమలాడుకుంటున్నారు.కానీ, నువ్వు వద్దు, నీ ఉపనాస్యం వద్దు అంటూ జనాలు పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డీ… నీ ఎంపీ విశ్వసనీయత అదీ” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 

అలాగే కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. దీనిని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. “ఇవాళ కావలి సభకు వచ్చిన జనాలను చూశావా జగన్ ఇదీ.. మా ఎంపీ విశ్వసనీయత. నిన్ను ఓడించడానికి మండుటెండలను కూడా లెక్కచేయకుండా మేము సిద్ధం అంటూ ముందుకొచ్చారు.వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అర్ధాంగి ప్రశాంతి రెడ్డి కోవూరులో పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన.. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గర అవ్వాలని వారు భావించారు. కానీ, ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు.ఆడబిడ్డపై మాట తూలితే  సహించబోము తాట తీస్తాం అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: