భారతదేశం ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. నాల్గవ దశ మే 13న షెడ్యూల్ చేశారు. ఇందులో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో, పోలింగ్ అధికారులను కేటాయించడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) రవాణా చేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఉండేలా చూసుకోవడం కోసం ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. అర్హులైన ఓటర్లకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో) ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొంతమంది ఓటర్లకు స్లిప్పులు అందకపోవచ్చు.

ప్రతి ఓటరు తమ ఓటరు స్లిప్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం, కానీ కొన్నిసార్లు, వివిధ కారణాల వల్ల, ప్రతి ఒక్కరికి ఎన్నికల రోజు ముందు అది అందదు. దీనిని పరిష్కరించడానికి, ఎన్నికల సంఘం ఒక పరిష్కారాన్ని అందించింది. ఓటర్లు తమ ఓటర్ స్లిప్‌లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్‌లలో ఓటరు పేరు, వయస్సు, లింగం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ స్థానం, గది సంఖ్య, పోలింగ్ తేదీ, సమయం వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అదనంగా, స్లిప్‌లో QR కోడ్ ఉంటుంది, ఇది స్కాన్ చేసినప్పుడు, ఓటరు వివరాలను త్వరగా వెల్లడిస్తుంది.

• మొబైల్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో మీ ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి

 1. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుండి 'ఓటర్ హెల్ప్‌లైన్ యాప్'ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. యాప్‌ని తెరిచి, 'డౌన్‌లోడ్ E-EPIC'ని ఎంచుకోండి.

3. మీ మొబైల్ నంబర్‌ను రిజిస్ట్రేషన్ చేసి, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి.

4. మొబైల్‌లో OTP అందుకుంటారు. దాన్ని యాప్‌లో నమోదు చేయాలి.

5. తర్వాత, ఓటరు ID కార్డ్‌లో కనిపించే EPIC నంబర్‌ను ఎంటర్ చేయాలి.

6. మీ వద్ద EPIC నంబర్ లేకపోతే, బదులుగా అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ని ఉపయోగించవచ్చు.

 7. OTPని ఎంటర్ చేసిన తర్వాత, ఓటరు స్లిప్ కనిపిస్తుంది. యాప్ నుంచి నేరుగా స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

• వెబ్‌సైట్ నుంచి ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్

1.https://voters.eci.gov.in వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.

 2. మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. తర్వాత ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. 'డౌన్‌లోడ్ E-EPIC'పై క్లిక్ చేయండి.
 
3. EPIC నంబర్‌ని ఎంటర్ చేయాలి. అంతే, ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: