ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా వైసిపి పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో  151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైసిపి పార్టీ... ఈసారి మాత్రం ఘోరంగా విఫలం అయింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలాంటి ఫలితాలను ఊహించలేదు. కేవలం ఈసారి 11 అసెంబ్లీ స్థానాలకే వైసీపీ పార్టీ  పరిమితమైంది. ఇటు తెలంగాణలో గులాబీ పార్టీ ఎన్నడూ లేని విధంగా... జీరో సీట్లకు పరిమితమైంది.

 ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా... ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు కొత్త విషయాన్ని  ఓడిపోయిన పార్టీలు తెరపైకి తీసుకు వస్తున్నాయి. ఓడిపోయిన పార్టీ కచ్చితంగా... ఇలాంటి ఆరోపణలు చేయడం కామన్. ఇక వైసిపి పార్టీ 11 స్థానాలు వచ్చిన నేపథ్యంలో... బ్యాలెట్ పేపర్ నినాదాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలామంది... ప్రముఖులు ఈవీఎంలు వాడకూడదని చెబుతున్నారు. ఎలాన్ మస్క్ కూడా బ్యాలెట్ పేపర్ ఏ ముద్దు అంటున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో... మాజీ పోలీస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ....ఈవీఎం ట్యాంపరింగ్ జరగడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి పార్టీ ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకువస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యపడదు కానీ... ప్రస్తుత జనరేషన్ లో వాటిని కూడా ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఆయన చెప్పారని సమాచారం. ఇక ఇదే అంశంపై... సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనే విధంగా... ఆయన మాట్లాడారు. దీనికోసం ఒక యాప్ ఉంటుందని... ఆ యాప్ ద్వారా ఈవీఎంలను కంట్రోల్ చేయవచ్చని కృష్ణంరాజు తెలిపారని సమాచారం. ముంబై మహానగరంలో కూడా వీటి మీద కేసు నడుస్తుందని... అది కూడా రుజువు అయిందని చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. అయితే.. ఈ అంశాలను బట్టి చూస్తే ఈవీఎం ట్యాంపరింగ్ జరగవచ్చని తెలిపారు.

మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కడప జిల్లాలోని ఒక బూతులో... ఒక పార్టీకి చెందిన వ్యక్తి... రిగ్గింగ్ చేసి... గెలవాలని అనుకున్నాడట. అందుకోసం ఎక్కువ ఓట్లు తన పార్టీకి గుద్దేశాడాట. కానీ ఫలితాలు వచ్చే రోజు తన పార్టీకి కాకుండా ప్రత్యర్థి పార్టీకి ఎక్కువ ఓట్లు... వచ్చినట్లు... ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయాన్ని కృష్ణంరాజు తెలిపారు. అయితే...400 సీట్లు గెలిచేలా టాంపరింగ్‌ చేస్తే అనుమానాలు వస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో టాంపరింగ్‌ అవుతుందని కూడా ఆయన చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

evm