
దాతృత్వంలో తన చేతికి ఎముక లేదని పేరు తెచ్చుకున్నారు ఏలూరు జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రభాకర్ మాట కరుకు.. మనసు వెన్నే. పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. దానకర్ణుడే.. కానీ మాట తూలడం ఒక్కటే ఆయన పొలిటికల్ కెరీర్‌కు ఓ మైనస్. పెట్టడంలో.. అభివృద్ధి చేయడంలో ఆయనకు ఆయనే సాటి.. మేటి. ఇక ప్రజలకు భోజనాలు పెట్టడం అంటే.. వారి కడుపు నింపడం అంటే చింతమనేనికి మహా ఇష్టం. ఆయన ఇంటి దగ్గర ప్రతి రోజు వందల మందికి భోజనాలు పెడుతూనే ఉంటారు. పార్టీ కార్యక్రమాలు అయినా.. పండుగలు అయినా... మరొకటి అయినా అన్నదానాలకు సాయం చేయడంలో చింతమనేని ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఎక్కడో పార్టీ కార్యక్రమం జరిగి తన నియోజకవర్గం మీదుగా కార్యకర్తలు వెళుతున్నా ఆయన భోజనాలు చేయించి మరీ వారికి కడుపునిండా పెట్టి పంపడంలో తనకు ఎంతో ఆనందం ఉందని చెపుతుంటారు.
ఇక ఇటీవలే ఆయన రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు అందరికి మటన్ పంపారు. ఇక శ్రీరామనవమి రోజు తన నియోజకవర్గంలో ప్రతి శ్రీరాముడి ఆలయంతో పాటు నవమి పండుగ బహిరంగంగా జరిగిన ప్రతి చోటా ప్రత్యేకంగా బెల్లం బుట్టలు పంచారు. అనకాపల్లి నుంచి ప్రత్యేకంగా బెల్లం బుట్టలు తెప్పించి మరీ భారీ ఎత్తున పానకం కోసం బెల్లం పంచారు. తాజాగా హైదరాబాద్‌లోనూ చింతమనేని తన దాతృత్వం చాటుకున్నారు. చింతమనేనికి ముందు నుంచి ఈ ప్రచారం చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. తాజాగా చింతమనేని ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు శాస్త్రీయ అధ్యయన యాత్రలో భాగంగా గురువారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు.
హైదరాబాద్ లో పర్యటిస్తున్న ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 250 మంది చిన్నారులకు, వారి వెంట ఉన్న సిబ్బందికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాలా స్పెషల్ ఆధిత్యం ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఐ మ్యాక్స్ వద్ద ఉన్న ప్రముఖ ప్యారడైజ్ హోటల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేడి వేడి హైదరాబాదీ బిర్యానీ వడ్డించేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే చింతమనేని తమపై చూపించిన ప్రేమాభిమానాలకు విద్యార్థులు, సిబ్బంది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు నుంచి శాస్త్రీయ యాత్ర అధ్యయనకు బయలు దేరిన ఈ విద్యార్థులకు రాత్రి కావాల్సిన సౌకర్యాలు కూడా చింతమనేని అందించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.