
రేవంత్ రెడ్డి అధికారం కోసం హామీలతో ప్రజలను మోసం చేశారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు హామీల అమలును ప్రశ్నిస్తే, వారిపై కేసులు, జైళ్లతో బెదిరిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలం సొరంగం పనుల్లో హడావిడితో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు శవాలను కూడా అందించకుండా సహాయక చర్యలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
పదిహేడు నెలల కాంగ్రెస్ పాలనను గాలిమోటార్ పాలనగా నిరంజన్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులకు సరైన అవగాహన లేకుండా అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలపై పూర్తి స్పృహ ఉందని, సమయం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. కేసీఆర్ మరో పదేళ్లు అధికారంలోకి రారని రేవంత్ భావిస్తే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు