
తెలంగాణ రాష్ట్రంలో ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని.... అప్పు కూడా పుట్టడం లేదని తేల్చి చెప్పారు. తనను కోసిన కూడా ఒక్క రూపాయి పుట్టదని... కావాలంటే తనను కోసుకొని తినండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నెలకు 18 వేల కోట్లు వస్తే... పెన్షన్లు అలాగే ఉచిత కరెంటు ఇలా పథకాల కోసం ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేదా బోనస్ లు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
ఒకవేళ ఇవ్వాలంటే తెలంగాణ ప్రజలకు ఇస్తున్న పెన్షన్లు లేదా ఉచిత కరెంటు ఆపేయాలని బాంబు పేల్చారు. మరి మీకు నిజంగానే బోనసులు కావాలంటే.... తెలంగాణ ప్రజలతోనే తేల్చుకోండి అంటూ... ప్రజలు అలాగే ఉద్యోగులకు మధ్య చిక్కు ముడి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుల కోసం వెళ్తే దొంగల్లా తమల్ని చూస్తున్నారని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి అప్పు కోసం ఢిల్లీకి వెళ్తే పారిపోతున్నారని కూడా తెలిపారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు