పహల్గామ్ ఉగ్ర‌దాడికి భార‌త్ ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌పై ప్ర‌తికారం తీర్చుకుంది. పాకిస్థాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేల‌మ‌ట్టం చేయ‌డ‌మే కాకుండా వంద మందికి పైగా టెర్ర‌రిస్తుల‌ను ఇండియ‌న్ ఆర్మీ హ‌త‌మార్చింది. ఆ దాడి త‌ర్వాత పాకిస్తాన్ భార‌త్ తో యుద్దానికి సై అంటూ రెచ్చిగొట్టింది. దాంతో ఇరు దేశాల సరిహద్దుల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంలో భార‌త్ ముందు పాక్ ఏమాత్రం నిల‌బ‌డ‌లేక‌పోతుంది. భారత పౌర ప్రాంతాలు, సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాక్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నా.. ఇండియ‌న్‌ ఆర్మీ వారి ప్ర‌య‌త్నాల‌ను తిప్పి కొడుతోంది. పాక్ ఆర్మీ బేస్‌ను కూడా నాశ‌నం చేసింది.


దాడులు, ప్ర‌తిదాడుల న‌డుమ పాకిస్తాన్ విల‌విల్లాడిపోతుంది. భార‌త్ దెబ్బ‌ల‌కు తీవ్ర నష్టం చూస్తోంది. ఇటువంటి క్లిష్ట స‌మ‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డ‌మే బెట‌రంటూ పాలు దేశాలు పాకిస్తాన్ కు సూచిస్తున్నాయి. ప‌రిస్థితి చేయి దాటక ముందే భారత్‌తో చర్చలు జరపాలని పాకిస్థాన్‌ను తాజాగా అగ్ర‌రాజ్యం అమెరికా సైతం హెచ్చ‌రిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే మీరాపితే మేము ఆపేస్తామంటూ భార‌త్ తో పాక్ కాళ్ల బేరానికి వ‌చ్చింది.


పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ భార‌త్ ఎదుట ఓ కీల‌క ప్ర‌తిపాద‌న పెట్టారు. భారత్ సైనిక దాడిని ఆపితే తమ దేశం కూడా ఆపడానికి ప్రయత్నిస్తుందని.. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు ఉండటంతో వీటిని తగ్గించాలని తాము కోరుకుంటున్నామ‌ని ఇషాక్ దార్ పేర్కొన్నారు. పాక్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, భారత్ దాడులు ఆపితే తాము ఆపుతామ‌ని, ఇక ప్రతీకారం తీర్చుకోమని ఇషాక్ దార్ తెలిపారు.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: