వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ... ఆ పార్టీ కి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ మ‌హిళా నేత కావ‌డంతో పాటు కీల‌క ప‌ద‌విలో ఉన్న నేత కావ‌డం తో జ‌గ‌న్ ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. క‌డ‌ప జిల్లా రాయ‌చోటి కి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ .. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకీయా ఖానమ్ తన ఎమ్మెల్సీ పదవికి .. అటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె త‌న ప‌ద‌వి కి రాజీనామా చేయ‌డం తో పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేగిన‌ట్ల‌య్యింది. పైగా త‌మ‌కు ప‌ట్టున్న మైనార్టీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధి రాజీనామా ను జ‌గ‌న్ సైతం జీర్ణించుకోలేక పోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మండ‌లి లో వైసీపీ కి మ‌రో వికెట్ డౌన్ అయిన‌ట్ల‌య్యింది.


ఇక పార్టీ కి .. ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్‌ను జాకీయా ఖానమ్ కలిసినట్లు స‌మాచారం. ఏపీ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంద‌నే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఎవ్వ‌రూ కూడా ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఇక ప్రస్తుతం రాజీనామా చేసిన జాకియా ఖానమ్‌ను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: