ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు ముగిసి ఏడాది అవుతోంది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి కేవలం 11 అసెంబ్లీ నాలుగు లోక్సభ సీట్లకు పరిమితం అయింది. 2019 ఎన్నికలలో 22 లోక్సభ ... 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అప్రతిహత విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ ఐదేళ్లు గడిచేసరికి ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయారని చెప్పాలి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న వేళ వచ్చే ఎన్నికలలో విజయం కోసం ఎప్పటినుంచే కష్టపడాలి అంటూ జగన్ తన పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. ఈ క్రమంలోనే తాను 2027 నుంచి కంటిన్యూగా ప్రజల్లోనే ఉంటానని 2027 నుంచి 2029 ఎన్నికల వరకు రాష్ట్రం అంతట పాదయాత్ర చేస్తానని తమ పార్టీ నాయకులకు చెప్తూ వస్తున్నారు.


జగన్ ఎన్ని హామీలు ఇస్తున్నా తమ పార్టీ నాయకులకు ఎన్ని మాటలు చెబుతున్నా వారు మాత్రం పార్టీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తాజాగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ జకియాఖానూం ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లిపోతున్నారు. మైనార్టీ మహిళ నేతకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు ... అలాంటి నేతలు జగన్ నమ్మే పరిస్థితి లేదంటే వైసీపీలో అసలు ఏం జరుగుతుంది ? వచ్చే నాలుగేళ్లలో ఇంకా ఇంకెంత మంది కీల‌క‌ నేతలు పార్టీని వెళతారు ? జగన్ వీళ్ళలో ఎలాంటి నమ్మకాలు కలిగించే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తారు ? అన్న ప్రశ్నలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్ గా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: