భారత్ , పాకిస్థాన్ మీద చేపట్టినటువంటి ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఉండేటువంటి పాకిస్థాన్ గూఢచారూలను ఏరు వేసే పనిలో పడింది భారత్ . ఈ క్రమంలోనే మూడు రోజులలోనే సుమారుగా 11 మంది గూఢచారులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇందులో ప్రముఖ యూట్యూబర్ గా పేరుపొందిన జ్యోతి మల్హోత్రా కూడా ఒకరు. ఈమెతోపాటుగా చాలామంది అరెస్ట్ అయిన వారిలో కొంతమంది చదువుకునేవారు, సెక్యూరిటీ గార్డులు, యాప్ డెవలపర్స్ కూడా ఉన్నారట.


ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు గూఢచారంగా పనిచేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా డబ్బుల కోసమే పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇందులో 20 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్న కుర్రాళ్ళు కూడా ఉన్నారు.

గజాలా, యామిన్: డబ్బుల కోసమే పాకిస్తాన్ ఏజెంట్లతో చేతులు కలిపి సమాచారాన్ని పంచుకుంటున్నారు. వీరిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా:
పాకిస్తాన్ కి గూఢచారిగా కేసులు ఇటీవలే అరెస్ట్ అయింది. 2023, 24,25 మార్చిలో పహాల్గామ్ దాడిలో కూడా ఈమె పాకిస్తాన్ కి వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు.


దేవేంద్ర సింగ్:
పంజాబ్ లోని పటియాలకు చెందిన వ్యక్తి. ఈయన ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ కూడా చదివారు. పాకిస్తాన్ కి గూఢచారిగా ఉన్నారు. కటియాలాలో ఉండే మిల్ట్రీ ఫోటోలను కూడా షేర్ చేశారు.


ఆర్మాన్:
హర్యానాలోని నూహ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. పాకిస్తాన్ కి గూఢచారంగా ఉంటూ ఇండియన్ ఆర్మీకి సంబంధించి మిలిటరీ కార్యక్రమాలకు సంబంధించి అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉండేవారట. పోలీసులు పట్టుకొని అన్నిటిని విచారిస్తున్నారు.


తరిఫ్:
హర్యానాలోని సుహ్ కు చెందిన వ్యక్తి. పాకిస్తాన్ లో ఇద్దరు ఉద్యోగులతో టచ్ లో ఉన్నారు. వాళ్లే సిమ్ కార్లు ఇవ్వడంతో ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ఫోటోలను కూడా షేర్ చేసేవారు.

నవ్యాన్ ఇల్లాహి:
హర్యానాలోని పానిపట్టులో ఉంటున్నారు. పాకిస్తాన్ కి చెందిన ఐఏఎస్ ఏజెంట్ తో టచ్ లో ఉన్నారు. ఇతను ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.

మహమ్మద్ ముర్తాజా అలీ:
పంజాబ్ లోని జలాంధ్రకు చెందిన వ్యక్తి.. సొంతంగా ఒక మెసేజ్ యాప్ ని తయారు చేసి పాకిస్తాన్ ఐఎస్ఐ కి సమాచారాన్ని అందించేవారు.

షహజాద్:
యూపీలో వ్యక్తి. ఇతని ఎన్నోసార్లు పాకిస్తాన్ కి వెళ్లి వచ్చారు. అయితే అక్కడి నుంచి అక్రమంగా క్రాస్మోటిక్, దుస్తులు, మసాలా దినుసులు వంటివి ఇక్కడ అమ్మేవారట. ఇక్కడ విషయాలను అక్కడ చెప్పేవారని అధికారులు అరెస్టు చేశారు.

సుఖ్ ప్రీత్ సింగ్, కరణ్ వీర్ సింగ్:
వీరిద్దరూ కూడా పంజాబీ ప్రాంతానికి చెందిన వారే.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేశారట. ఐఎస్ఐ వీరి ఖాతాలోకి లక్ష రూపాయల వరకు పంపిందని సమాచారం కూడా చేసేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి: