పెళ్లిళ్లు అంటే నేటి కాలంలో ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. వివాహం చేసుకోవడం చిన్నచిన్న గొడవలు, మనస్పర్ధల కారణంగా విడాకుల వరకు వెళ్తున్నారు. కుటుంబానికి, బంధాలకు ఎవరు కూడా విలువను ఇవ్వడం లేదు. మరి కొంతమంది పిల్లలు ఉన్నప్పటికీ వారి భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా విడిపోతున్నారు. పిల్లల భవిష్యత్తును వారే పాడు చేస్తున్నారు. సోషల్ మీడియా కాలంలో వివాహం అంటే కొంతమందికి మోసం చేయడం అలవాటు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే పాస్వాన్ ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో ఆసుపత్రిలో పనిచేసే ఓ కిలాడీ లేడీ ఏకంగా 25 మందిని వివాహం చేసుకొని మోసం చేసింది.

 
ఇదంతా కేవలం ఏడు నెలల సమయంలోనే చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనురాధ గతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆ వ్యక్తితో అనేక రకాల చిత్రహింసల కారణంగా అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత భోపాల్ వచ్చి అక్కడ ఉండే వివాహ మోసాల మూటతో చేతులు కలిపింది. వారు అనురాధను ఉపయోగించుకుని అనేక మందిని మోసం చేశారు. ఆమె ఫైనల్ గా భోపాల్ లో గబ్బర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అతని నుంచి రెండు లక్షలు దొంగించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.


ఇక అదే పనిగా ఒకరిని వివాహం చేసుకోవడం వారి వద్ద నుంచి డబ్బు, బంగారం దోచుకొని పారిపోవడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదట తాను ఒంటరిగా జీవిస్తున్న పేద మహిళలని అబ్బాయిలను నమ్మించి పెళ్లి చేసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత వారి అత్తారింట్లో చాలా అమాయకురాలిగా, మంచితనంగా నటించేది. అనంతరం తన మూటతో కలిసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ మత్తుమందు కలిపిన ఆహారాన్ని తినిపించేది. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకొని పారిపోయేది. చివరకు అనురాధ మాదోపూర్ పోలీసుల చేతికి దొరికింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: