ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీటు అమ్ముకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అంటూ  ఓ రేంజ్ లో రెచ్చిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడుకు... మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఫైర్ అయ్యారు. ప్రలోభాలకు లోనై రాజ్యసభ సీటును అమ్మేశారని ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకు అసలు విలువ ఉంటుందా...? ఎందుకు ఆ బతుకు అంటూ చచ్చిపోయారు. 

ఇవాళ మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అప్పుల సామ్రాట్ అంటూ చురకలాంటించారు. మా ఐదు సంవ త్సరాల పాలన లో 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. చంద్రబాబు నాయుడు 12 నెలల్లోనే లక్ష్య 37 వేల కోట్లు అప్పు చేశాడని... విమర్శలు చేశారు. 

మేము ఐదు సంవత్సరాలలో చేసిన అప్పు... చంద్రబాబు నాయుడు ఏడాది కాలం లో చేశాడని ఆరోపణలు.. చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు బెయిల్ పై ఉంటూ అధికార దుర్వినియోగం.. తనపై కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. బెయిల్ కండీషన్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు.. చంద్రబాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?అని నిలదీశారు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: