టీడీపీ మ‌హానాడుకు నాయ‌కులు పెద్ద ఎత్తున  కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీకరిస్తున్నారు. మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే మ‌హానాడు.. తొలిసారి క‌డ‌ప‌లో జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో బాప‌ట్ల ఎమ్మెల్యే వేగేశ్న న‌రేం ద్ర వ‌ర్మ.. పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌ల‌ను మ‌హానాడుకు త‌ర‌లించే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో సుమారు 100 కార్లు, 50 బ‌స్సులను ఏర్పాటు చేశారు. నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుమారు 2 వేల మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌ల‌ను మ‌హానాడుకు తీసుకువెళ్లేందుకు ఆయ‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు.


ఇదిలావుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ కార్యాల‌యాల‌ను ముస్తాబు చేశారు. మూడు రోజుల పాటు పార్టీ కార్యాల‌యా ల వ‌ద్ద విద్యుత్ దీపాల‌తో అలంకరించారు. ప్ర‌తి మండ‌లంలోనూ కార్య‌క‌ర్త‌ల‌ను స‌మాయత్తం చేశారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయేలా ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక‌, వ‌చ్చే మూడు రోజ‌లు కూడా.. మండ‌ల‌స్థాయిలో ఉన్న నాయ‌కులు.. మ‌హానాడుకు రాలేని నాయ‌కుల కోసం.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


అంటే.. ప్ర‌తిమండ‌ల‌స్థాయిలో ఉన్న టీడీపీ కార్యాల‌యంలో పెద్ద తెర‌లు ఏర్పాటు చేశారు. మ‌హానాడు కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొత్తం 20 భారీ తెర‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు పార్టీ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. అదేవిధంగా చివ‌రి రోజు అంటే.. మ‌హానాడు మూడో జోరు.. క‌డ‌ప‌లో పెద్ద ఎత్తున భోజ‌నాలు, స‌భ ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇక్కడ కూడా మండ‌లానికి 200 మంది చొప్పున భోజ‌నాలు చేసేలా ఆ ఒక్క‌రోజు ఏర్పాటు చేశారు.


ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీకార్య‌క్ర‌మాలు వీక్షించేలా తెర‌ల స‌దుపాయంతోపాటు.. వ‌చ్చే వారికి అయ్యే ఖ‌ర్చును పూర్తిగా ఎమ్మెల్యే వ‌ర్మే పెట్టుకుంటున్నారు. అంతేకాదు.. బాప‌ట్ల నుంచి వ‌చ్చే వారికి ప్ర‌త్యేకంగా త‌న సంత‌కంతో కూడిన పాసులు అందించారు. వీరితో ఎప్పుడూ ట‌చ్‌లో ఉండేలా ఐదుగురు స‌భ్యుల‌తో ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేశారు. వీరు మిగిలిన వారిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఏర్పాట్ల‌లో లోటు పాట్లు రాకుండా చూసుకుంటారు. ఇలా.. బాప‌ట్ల నుంచి మ‌హానాడు కు వెళ్లేవారికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు వ‌ర్మ‌.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: