ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హత్యా రాజకీయాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలలోని పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు కూడా చాలా దారుణ హత్యలకు గురవుతున్నారు.. ముఖ్యంగా వారిలో వారికి తగాదాలు రావడం వల్ల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో టిడిపి పార్టీ నేత దారుణ హత్యకు సంబంధించిన ఘటన ఏపీ అంతట మరొకసారి ఒక సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకున్నదట.



నెల్లూరులో ఉండేటువంటి తాత హోటల్ పక్కన టిడిపి నేత తోవూరి నరసింహారావు అనే వ్యక్తిని కత్తితో పొడిచి మరి చాలా కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.. ఇక చంపిన వ్యక్తి బ్రహ్మయ్య అన్నట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. బ్రహ్మయ్య అంతటితో ఆగకుండా రెండు రోజులు నరసింహ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మరి బోరు బావిలో వేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అయితే ఈ టిడిపి నేత నరసింహారావు దగ్గర నిమ్మ తోటలకు కాపలాగా పనిచేసేవారట బ్రహ్మయ్య.


ఏదో విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయని ఆ తర్వాత నరసింహను చాలా దారుణంగా హత్య చేశాడట బ్రహ్మయ్య. బ్రహ్మయ్య నరసింహను చంపినందుకు గల కారణాలు ఏంటో తెలియజేయలేదు. నరసింహ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల సైతం బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడికి ఖచ్చితంగా శిక్ష వేయాలంటూ అక్కడ టిడిపి నేతలతో పాటు కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక అధికారులు కూడా బోరు బావి దగ్గరికి వెళ్లి మరి ఆధారాలను సేకరించి పనిలోనే ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ విషయం పైన అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అధికార పార్టీ అయినప్పటికీ కూడా చాలామంది టిడిపి నేతలను కోల్పోవలసి వస్తోంది టిడిపి పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి: