- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ )

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి సొంతం నియోజకవర్గం పులివెందుల జడ్పిటిసి స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో హై వోల్టేజ్ యాక్షన్ అంశంగా మారింది. ఇటీవల కాలంలో పులివెందుల వైసీపీ విషయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పెద్దగా యాక్టివ్ గా లేరు. టిడిపి నుంచి వైసీపీలో చేరిన సతీష్ రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిజానికి పులివెందులలో ఇప్పటివరకు జరిగింది రాజకీయం కాదు .. వర్గ పోరాటం అలాంటి వర్గ పోరాటంలో సతీష్ రెడ్డి వచ్చి పార్టీలో చేరితే కలవటానికి వైఎస్ కుటుంబ వర్గాలు సిద్ధంగా లేవు. అయితే జగన్ను మెప్పించాలంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి అన్న ఫార్ములా సతీష్ రెడ్డి పాటిస్తున్నారు. ఇది పులివెందులలో వైసీపీకి ఎంత మాత్రం ఫ్ల‌స్ కాదని క్యాడర్ వాపోతున్నారు. ఇక వివేక హత్య కేసులో ఇరుక్కున్న అవినాష్ రెడ్డి ప్రజల ముందుకు తరచుగా రాలేకపోతున్నారు.


పులివెందుల ప్రజలకు వివేకాతో అనుబంధం ఉంది. మంచివాడు అయినా ఆయనను అంత ఘోరంగా చంపటమే కాదు గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేయటం అక్కడ చాలామంది ప్రజలకు నచ్చటం లేదు. అలాగే వైఎస్ షర్మిల - విజయలక్ష్మి వేరుబాట పట్టడంతో ఆ కుటుంబానికి నిజమైన అభిమానులు కూడా జగన్ పై అంత సానుభూతితో లేరు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పులివెందులలో పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు కడపలోనే రాలేదు. కడప జడ్పీలో మొత్తం 52 స్థానాలు ఉంటే అందులో 49 ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు పులివెందులలో ఏకంగా 11 మంది పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ వచ్చింది. ఏది ఏమైనా పులివెందుల ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఎవరిది పై చేయి అవుతుంది అన్నది తీవ్ర ఉత్కంఠ గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: