
ఆలా మారుమోగిన ముద్రగడ పేరు టిడిపిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఈ కాపు ఉద్యమ నేత నాయకుడు చంద్రబాబుతో మంచి స్నేహబంధం ఉండేది.. కానీ 2014 నుంచి చంద్రబాబుకి వ్యతిరేకంగా మారారు.. కాపులను బీసీలలోకి చేరుస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి గెలిపించినప్పటికీ వాటిని చేయకపోవడంతో మళ్లీ ఉద్యమమే నడిపారు ముద్రగడ. ఇక తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే.. కొన్ని రోజులపాటు ముద్రగడను అరెస్టు చేయడం కూడా జరిగింది. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో ముద్రగడ మీద కేసులు, ఆ ఘటనకు సంబంధించిన కేసులు అన్నీ కూడా తీసివేయడం జరిగింది.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు మీద తిరిగి విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కోర్టులో అప్పీల్స్ వేసిన.. ఆ తర్వాతే 24 గంటల లోనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందట. ముద్రగడ మళ్లీ ఎలాంటి వాటికైనా సిద్ధంగానే ఉంటారని దీని వల్ల కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాళ్లు కూడా మొదలవుతాయని అందుకే వెనక్కి తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. కూటమిలో జనసేన పార్టీ కి కాపులకు సపోర్టివ్ గా ఉన్నది..ప్రస్తుతం ముద్రగడ కూడా వైసీపీలో ఉన్నారు. ఆయన ఎలాంటివి చేసినా కూడా అది వైసిపి పార్టీకి సపోర్టివ్ గానే ఉంటుంది.అలాగే ఆయనకు వైసిపి పార్టీ అండ కూడా ఉంటుంది. గత కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న ముద్రగడను మళ్ళీ పేరు వినిపించేలా చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఆయన గ్రాఫ్ పెంచినట్లు మాత్రం..