- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా రేవంత్ రెడ్డి తన కాబినెట్లో ముగ్గురికి చోటు ఇస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం జరగనుంది. బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ , ఎస్సీ సామాజిక వర్గం ( మాల ) నుంచి పార్టీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి , అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చోటు లభించనుంది. అలాగే శాసనసభ ఉపసభాపతిగా జాటోతు రామచంద్రనాయక్ను ఎంపిక చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ , ఎస్టీ , బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపించిన ప్రస్తుతానికి ఎస్సీ , బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్టు తెలిసింది.


మాదిగ సామాజిక వర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబట్టినట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు మంత్రి వెంకటరెడ్డిని కూడా కొనసాగించడం కష్టమ‌ని.. ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాలని ఉంటుందని అధిష్టానం స్పష్టం చేయడంతో ప్రస్తుతానికి అంశాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. నాలుగో పేరును ప్రస్తుతానికి పక్కన పెట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయాలని రేవంత్ భావించినట్టు తెలుస్తోంది.


మరో మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి బీసీల నుంచి ఆది శ్రీనివాస్‌ ప్రస్తుతం శాసనసభలో విఫ్‌గా ఉన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరు లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే , స్పీక‌ర్‌ ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకొని అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి స్పీక‌ర్‌ పదవి ఇస్తే ఎలా ఉంటుందనే ? అంశం కూడా చర్చకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ లైనుకు భిన్నంగా ఎవరూ మాట్లాడిన తర్వాత పదవులలో వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదని కూడా అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: