- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఆరు నెలలు అవుతుంది. తాజాగా వెలువ‌డుతున్న సర్వేలలో కూటమీ ప్రభుత్వం చాలా వరకు పడిపోతున్నట్టు చెబుతున్నారు. 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని జిల్లాలలో చాలా ఘోరంగా పార్టీ గ్రాఫ్ ప‌డిపోతుందని అక్కడ జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టిడిపిలో అసంతృత్తులు బాగా ముదిరిపోయి ఉన్నాయి. పార్టీలో సరైన ప్రాధాన్యత దక్క‌ని వారు పార్టీపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. తాజాగా గత ఎన్నికలలో రాజంపేట నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అడుగులు వైసిపి వైపు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.


ఇక రాజంపేటలో మాత్రమే కాదు . . . రాయచోటిలోనూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. మదనపల్లిలో ఎమ్మెల్యేకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడికి మధ్య తీవ్రమైన గొడవలు జరిగి ముదిరిపోయాయి. చివరకు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఇక పుంగనూరు - తంబళ్లపల్లెలో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే ఉన్న అక్కడ కూడా టిడిపి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఎంత విచిత్రం అంటే వాస్తవంగా జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉండి .. టీడీపీకి ఎప్పుడు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇప్పుడు కడపలో కాస్త కూసో టీడీపీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంటే అన్నమయ్య జిల్లాలో చాలా వీక్‌ అయిపోతున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టి అన్నమయ్య జిల్లాలో పార్టీని ఎలా పటిష్టం చేస్తారో ? చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: