ఇటీవలే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ను అరెస్టు చేయడం జరిగింది. ఈ విషయం పైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని ప్రజాస్వామ్యం న్యాయస్థానం పూణే అయిపోయిందని .. ప్రజాస్వామ్యవాదుల్ని, జర్నలిస్టుల్ని భయం కలిగేలా చేస్తున్నారు కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలు అన్యాయ పాలన పైన ప్రజలు కచ్చితంగా తిరగబడతారు.. ఏడాదిలో తన దుర్మార్గపు పాలన ,మోసాల పాలన, అవినీతి వైఫల్యాల పైన ప్రజలు రాబోయే రోజుల్లో తిరగబడతారు.. చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం చేస్తున్నారంటు ఫైర్ అయ్యారు.


70 ఏళ్లు వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు చేయడం ఇది కక్షపూరిత విష సంస్కృతి అంటూ హెచ్చరించారు. సహజంగా ఒక డెబిట్ జరిగినప్పుడు అక్కడ మాట్లాడే వ్యక్తుల మాటలకు యాంకర్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది.. కొందరు అనుకూలంగా మరి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. గెస్టులుగా వచ్చి చాలా సందర్భాలలో ఎలాంటి మాటలు మాట్లాడారు మనం చూడలేదా? ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు.


ప్రజల తరఫున మీడియా నిలవకూడదని చంద్రబాబు చేసినటువంటి తప్పులను ప్రశ్నించకూడదంటూ ఒక పథకం ప్రకారమే ఇలాంటివి చేస్తున్నారని.. తాను చేసే మోసాలను ప్రతిసారి కప్పిపుచ్చుకునేందుకే టాపిక్ లను డైవర్ట్ చేస్తూ ఉన్నారని.. అందుకే సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారని. కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టడం ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించారని. ఇప్పుడు కూడా చంద్రబాబు కి మద్దతుగా లేని ఛానల్ లను కూడా నియంత్రిస్తూ కక్ష సాధింపులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కొమ్మినేని అరెస్టు ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్. ఈరోజు ఏది విత్తారో రేపు కూడా అదే పడుతుందని విషయాన్ని మర్చిపోకూడదంటూ మాజీ సీఎం జగన్ ట్విట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: