పార్వతీపురం: రాజకీయంగా నేను అదృష్టవంతుడ్ని, ఎన్టీఆర్ లాంటి తాత, చంద్రబాబు లాంటి విజనరీ కుటుంబంలో జన్మించడం నా అదృష్టమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పార్వతీపురంలో విద్యార్థినీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానాలిచ్చారు.ఈ సందర్భంగా మీకు రాజకీయాల్లో స్పూర్తినిచ్చింది ఎవరు అని కురుపాం జడ్ పి హైస్కూలుకు చెందిన రిషిత అనే విద్యార్థిని అడిగినపుడు లోకేష్ సమాధానమిస్తూ... నిత్యం రాష్ట్రంకోసం పరితపించే బాబుగారివద్ద చాలా ఆలోచనలు ఉంటాయి. ఆయన వద్ద చాలా నేర్చుకుంటాం. వాజ్ పేయి నుంచి కూడా స్పూర్తి పొందాను. దేశంలో పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తెస్తే, వాజ్ పేయి గారు టెలికం, రోడ్డు, ఎడ్యుకేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారు. అంతర్జాతీయంగా సింగపూర్ మాజీ ప్రధాని లిక్వాండో నాకు ఇన్స్పిరేషన్. మత్స్యకార గ్రామాన్ని ప్రపంచంలోనే ఫైనాన్సియల్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దారు. జులై 15 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలను సందర్శిస్తా. అన్నిరంగాల్లో ఎపి నెం.1గా ఉండాలన్నదే మా లక్ష్యం అన్నారు.


వ‌చ్చే రెండేళ్లలో ఏపీ మోడల్ ను ప్రపంచానికి చూపిస్తామని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తాను ఇంజనీర్ కావాలని భావిస్తున్నట్లు రిషిత చెప్పారు. పాఠశాలల్లో లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాలని ఆమె కోరింది. లోకేష్ స్పందిస్తూ... గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి లైబ్రరీలపై దృష్టిపెడుతున్నాం. రీజనల్ లైబ్రరీలు ఏర్పాటుచేస్తున్నాం. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. కేవలం విద్యపైనేగాక స్పోర్ట్స్, ఎన్ సిసి, యోగా పై కూడా విద్యార్థులు దృష్టిపెట్టాలి. ప్రధాని మోడీజీ యోగాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బాల రాజ్యాంగాన్ని తయారుచేశాం. నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుతో పుస్తకాలు తయారుచేయించాం. మహిళలను గౌరవించడం ఇంటినుంచే మొదలు కావాలి. గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు, చీరకట్టుకున్నావా వంటి మాటలు మాట్లడవద్దు. టెక్స్ట్ బుక్ లో ఇంటిపనుల బొమ్మలను స్త్రీ,పురుషులిద్దరికీ చెరిసమానంగా ఉండేలా మార్చా. చట్టాలు ఎన్ని తెచ్చినా మనలో మార్పురాకపోతే కష్టం. అందుకే కెజి నుంచి పిజివరకు కరిక్యులమ్ లో మార్పులు తెస్తున్నాం.


నా ఫేవరేట్ ప్రొఫెసర్ రాజిరెడ్డి
పార్వతీపురానికి చెందిన కెజిబివి విద్యార్థిని జాహ్నవి మీ ఫేవరేట్ టీచర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ స్పందిస్తూ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా ఫేవరేట్. నేను చిన్నపుడు అల్లరి చేసినా ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదు. పేరెంట్ –టీచర్ మీటింగ్ పెట్టినపుడుల్లా అమ్మతో దెబ్బలు తినేవాడినిని అన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: