
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 164 సీట్లలో కూటమ పార్టీల నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మిగిలిన 11చోట్ల మాత్రమే వైసీపీకి చెందిన నాయకులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఏ పని జరిగిన ఏ మంచి అయినా ... చెడైనా కోటమే పార్టీల ఎమ్మెల్యేల మీదే నడుస్తోంది. పదేపదే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను సరైన దారిలో పెట్టేందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ విషయంలో బిజెపి నాయకత్వం నుంచి ఎలాంటి వార్నింగ్ లు లేదు. కానీ నాయకుల పనితీరును మాత్రం గమనిస్తున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేల పైన కొన్ని వివాదాలు ... విమర్శలు వచ్చాయి. దీంతో పార్టీ నాయకత్వం నివేదిక తెప్పించుకునే పనిలో ఉన్న విషయం తెలిసిందే. జనసేనలో నాయకులు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మూడు పార్టీలకు పరిస్థితి ఇలా ఉంటే ? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నాయకులు ఇంకా జగన్ భజనల్లోనే మునిగి తేలుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంగా జగన్ అసెంబ్లీకి రావటం లేదు. నాయకులు నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ 11 నియోజకవర్గాలలో జగన్ పులివెందులను పక్కన పెడితే పది నియోజకవర్గాలలోను నాయకులు విషయం చాలా కాంట్రవర్సీగా ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నాయకులు ఎవరూ బయటికి రావటం లేదు.. కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవటం లేదు. జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు మొక్కుబడిగా హాజరు వేయించుకుంటున్నారు. ఇది పార్టీకి మేలు చేసే కార్యక్రమం కాదని వైసిపి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇక టిడిపి - జనసేన - బిజెపి ఎమ్మెల్యేలు కలిసి సాగుతున్న నియోజకవర్గాల్లో మాత్రం పొలిటికల్ వాతావరణం బాగుంది. మిగిలిన చోట్ల మాత్రం ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా ఉంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు