కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది  గాంధీ ఫ్యామిలీ మాత్రమే.. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా ఎంతోమంది నేతలు భారతదేశాన్ని పరిపాలించారు. ఇక వీళ్ళ తర్వాత రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అలా కాంగ్రెస్ పార్టీ లో కీలకంగా ఉన్న రాహుల్ గాంధీ ఒక్కసారైనా ఇండియాకు ప్రధాని కావాలని అనేక విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఎన్నికల్లో కూడా ప్రధాని కావాలని ప్రయత్నం చేసి పార్టీని అన్ని రాష్ట్రాల్లో బలంగా నిలిపేందుకు శాయశక్తుల కృషి చేశాడు. కానీ తృటిలో ఆ అవకాశం తప్పిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ జోష్ పెంచి భారత్ జూడో యాత్ర పేరుతో భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో,ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాడు.

 ఈసారి ఆయన ప్రధాని అవుతాడని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మళ్ళీ బిజెపి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయినా రాహుల్ గాంధీ మాత్రం పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రజల వైపు ఉంటూ ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇలా రాజకీయాల్లో ఎంతో పేరుగాంచి ముందుకు వెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ 55 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా  ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలిసింది.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పెళ్లి ప్రేమపై నిత్యం ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

ఇదే తరుణంలో రాహుల్ గాంధీ తనకు ఓ లవర్ ఉందని ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2004లో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో తనకు స్పానిష్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలియజేశారు. ఆమె వెనిజులాలో ఉంటుందని, ఆర్కిటెక్ట్ గా పని చేస్తుందని తెలియజేశారు. తనకు ఆమెకు ఇంగ్లాండులో చదువుకునే సమయంలోనే పరిచయం ఏర్పడింది అని అన్నాడు. కానీ ఆమె పేరు మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు త్వరగా పెళ్లి చేసుకోండి సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: