
సొంత పార్టీ నాయకులను ముఖ్యంగా కార్యకర్తలను కూడా నిమ్మక జయకృష్ణ బెదిరించారని వారిపై కేసులు పెట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓ కార్యకర్తను అయితే ఆయన దూషించటం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులను ఆయన కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. గత ఎన్నికలకు ముందు టిడిపి నుంచి జనసేనలోకి మారిన నిమ్మక జయకృష్ణ ప్రస్తుతం టిడిపి నాయకులతోనే చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారనేది జనసేన నాయకులు ఆరోపిస్తున్న మాట.
జనసేన తరపున గెలిచిన చాలామందిలో టిడిపి నుంచి వచ్చిన వారు ఉన్నారు. అయితే అటు టిడిపి నాయకులను ఇటు జనసేన నాయకులను కూడా కలుపుకొని వారు రాజకీయాలు చేస్తున్నారు. కానీ నిమ్మక జయకృష్ణ విషయంలో మాత్రం ఇది పూర్తిగా ఏకపక్షంగా మారింది అనేది గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. పింఛన్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఆర్థిక సాయం నుంచి మాట సాయం వరకు కూడా ఆయన జనసేన కార్యకర్తలను గాని జనసేన నాయకులను గాని పట్టించుకోవడం లేదనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్న ఆరోపణ.
దీనికి తోడు టిడిపి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయటం టిడిపి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పు కాకపోయినా జనసేన నిర్వహించాల్సిన కార్యక్రమాలను మాత్రం ఆయన పక్కన పెడుతున్నారనేది మరో మా మాట. అయితే పార్టీ నేరుగా ఆయనను ప్రశ్నించలేదు. నేరుగా ఆయనను తప్పు పట్టలేదు. కానీ అంతర్గతంగా అసలు ఏం జరుగుతోందనేది తెలుసుకుని అనంతరం చర్యలు తీసుకోవాలని పార్టీ భావనగా ఉంది. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన అగ్ని వీర్ మురళి నాయక్ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 25 లక్షల రూపాయల చెక్కును ఇచ్చి పంపించినప్పుడు అందులో ప్రతినిధిగా నిమ్మక జయకృష్ణను నియమించారు.
అంటే పార్టీ ఆయన వదులుకోవాలని పార్టీ నుంచి దూరం పెట్టాలని గాని లేకపోయినా అంతర్గతంగా జరుగుతున్నటువంటి వివాదాలు స్థానికంగా వస్తున్న వ్యతిరేకతను మాత్రం పార్టీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి.