స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో భాగంగా పలు వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి , వాటిని ప్రకటించడానికి 30 రోజుల్లో గడువు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు  విజ్ఞప్తి చేసింది . అలాగే 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వాటిని చెప్పాలని కూడా చెప్పింది .. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా ఎన్నికల సంఘం హైకోర్టుకు చెప్పుకొచ్చింది .. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల సంఘానికి ఇంట్రెస్ట్ లేదని  పిటిషన్లు అయిన మాజీ సర్పంచ్లు హైకోర్టుకు తమ బాధను చెప్పుకున్నారు ..


నల్గొండ జిల్లా తాకట్లెపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొప్పుల పార్వతి, నల్గొండ జిల్లాలోని మరో ఐదుగురు మాజీ సర్పంచులు గ్రామపంచాయతీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరుతూ 2024 జనవరి 31న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు .. ఆ పిటీషన్లను పలుమార్లు వాయిదా పడి సోమవారం జస్టిస్ టి మాధవి దేవి ఏకసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు  వచ్చాయి .. అలా ఇరుపక్షాల వాదనలు గట్టిగా వినిపించారు .. అలాగే మరో 30 రోజుల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా .. అలాగే 30 రోజుల్లో కావాల్సిన పని చేసి తీరుతామని, మళ్లీ ఎలాంటి గడువు పొడిగింపు అడగకుండా ఉండడానికి  ప్రయత్నం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ..



అలాగే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి సమ్మతి తెలియజేసిన తర్వాత 60 రోజుల్లో ఎన్నికలను కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఎన్నికల కమిషన్ చెప్పుకొచ్చారు .. ఇరువురు వాదనలు విన్న ధర్మాసనం పంచాయతీల పదవీకాలం  పూర్తయి ఏడాది దాటిపోతుందని కూడా గుర్తుచేసింది .. అలాగే రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది .. పదవీకాలం ముగిసే లోపే ఎన్నికలు పెట్టాలని రాజ్యాంగంలో నిర్దేశించిన విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేసింది .. తుది తీర్పును  రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: