మిడిల్ ఈస్ట్  ప్రాంతంలో అమెరికాకు కీల‌క‌మైన సైనిక స్థావరాలు చాలా ఉన్నాయి .. అలాగే అమెరికా యూనివర్సిటీ పొలిటికల్‌ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ డేవిడ్ వైన్ తెలిపిన కేలక వివరాల ప్రకారం .. 2021 నాటికే అమెరికాకు 80 దేశాల్లో 750 సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది .. జపాన్ లో 120, జర్మనీలో 119, దక్షిణ కొరియాలో 79 ఏర్పాటు చేసుకుంది .. వీటి తర్వాత పశ్చిమాసియాలో కూడా ఎక్కువ ఆర్మీ స్థావరాలను స్థాపరుచుకుంది .. ఇక వాటిలో 40 వేల మంది సైనికులు ఉంటున్నారు .. ఇక ఇందులో చాలావరకు సముద్రంలోని యుద్ధనౌకలు మిగిలిన వారు 19 స్థావరా్లో ఉన్నారు. ఇక మిడిల్ ఈస్ట్ లోని బహ్రెయిన్, ఈజిప్టు, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లలో అమెరికా ఆర్మీ సైనిక స్థావరాలు ఉన్నాయి .. ఇక ఇందులో 8 స్థావరాలు అమెరికా శాశ్వతంగా మార్చుకుంది .. అలాగే వీటిలో మొదటిసారిగా 1958లో ఏర్పాటు చేసింది .. లేబనాన్‌ సంక్షోభం సమయంలో బీరుట్‌కు సైన్యాన్ని అమెరికా అందించింది ..


అలాగే ఖాతార్‌ రాజధాని దోహాలోని ఎడారిలో ఆల్ ఉదీద్‌ సైనిక స్థావరం కూడా ఏర్పాటు చేసుకుంది .. అయితే ఇది అన్నిటికంటే ఎంతో కీలకమైనది .. ఇక ఇది అమెరికా సెంట్రల్ కమాండ్‌ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతుంది .. ఇక్కడ ఒక్కచోటే 10,000 మంది సైనికులు ఉన్నారు .. ఇది ఈజిప్ట్ నుంచి తూర్పు కజకిస్తాన్ వరకు తన కార్యకరాపాలను కొనసాగిస్తుంది .. ఇక తర్వాత ఇరాక్ లోని అంబర్ ప్రావిన్స్ లో అల్ అసద్ వైమానిక స్థావరం కూడా ఏర్పాటు చేసుకుంది .. నేటి మిషన్ కు ఇది సహాయం అందిస్తుంది .. బహ్రెయిన్ లో అమెరికా స్థావరంలో 8,300  మంది సైనికులు ఉన్నారు .. అలాగే అమెరికా  నౌకాదళ కార్యకలాపాలకు ఈ స్థావరం ఎంతో ముఖ్యమైనది .. గల్ఫ్ ఎర్ర సముద్రం , అరేబియన్ సముద్రంతో పాటు హిందూ మహాసముద్రం లోని కొంత భాగాన్ని ఇది పర్యవేక్షణ చేస్తుంది ..

అలాగే కువైట్‌లో అరిఫ్‌జాన్, అలీ అల్‌ సలేంలలో అమెరికా స్థావరాలు ఉన్నాయి .. అరిఫ్‌జాన్‌ అమెరికా సెంట్రల్ సైన్యానికి ప్రధానకాంధ్రం.. అలాగే వీటితో పాటు 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో క్యాంప్ బుహ్ రింగ్ ను కూడా అమెరికా సిద్ధం చేసుకుంది .. ఇది ఇరాక్ , సిరియాలో తను సేవలు అందిస్తుంది .. అలాగే ఇక యూఏఈ లోని అబుదబిలో అల్ దఫ్రా లో వైమానిక స్థావరం కూడా ఉంది .. ఇది యూఏఈ వైమానిక దళంతో కలిసి పని చేస్తుంది .. ఐసిస్‌ ఉగ్ర సంస్థ  కార్యకలాపాలను అడ్డుకునే కీలక మిషన్లో ఇది భాగమై ఉంది .. అలాగే సౌదీ అరేబియాలోని రియాద్‌కు దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం ఉంది . ఇక్కడ 2321 మంది అమెరికా సైనికులు ఉన్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: