మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి రోజున  గుంటూరులోని  పోలీస్ ఏఐ ప్రారంభానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.. ఈ సందర్భంగా  టెక్నాలజీ వల్ల ఎలాంటి తప్పు చేసిన దొరికిపోతారంటూ తెలిపారు.. అలాగే  వైఎస్ వివేకానంద హత్య కేసులో గూగుల్ టేకౌట్లో అందరూ దొరికిపోయారు అన్నట్లుగా మాట్లాడారు.. తెనాలిలో గంజాయి బ్యాచ్ పైన పోలీసులు చర్యలు తీసుకుంటే..వారికి అండగా నిలబడితే చూస్తూ ఊరుకుంటామా అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.


ఆయన బాబాయిని చంపి నా మీద ఆరోపణలు చేశారని.. మొదట్లో గుండెపోటు అన్నారు.. పోస్టుమార్టం చేసిన తర్వాత..మా నాన్న లేరు చిన్నాన్న హత్య గురయ్యారు అంటూ వెల్లడించారు.. ఆ మరుసటి రోజున నరకాసుర రక్త చరిత్ర అన్నారు అంటూ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆరోజు నిందితులను పట్టుకొని మరి  అరెస్టు చేసి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అంటూ ప్రశ్నించారు.. వైయస్ వివేకాను అత్యంత దారుణంగా గొడ్డలితో హత్య చేశారంటూ మాట్లాడారు.


ఇప్పుడు అంత కొత్త రాజకీయమే.. అందరూ రౌడీలు లాగా మారిపోయి రాజకీయాలలోకి వస్తున్నారంటూ ఫైర్ కావడం జరిగింది. పోలీసులు వారందరి ముసుగులు తీసి మరి  నేరస్తులుగా నిలబెట్టకపోతే.. ఏపీలో లా అండ్ ఆర్డర్ ని కాపాడలేమంటూ వెల్లడించారు. ఆంధ్రాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టామని  వెల్లడించారు..పల్నాడులో చేసిన తప్పుని ఎలా బకాయిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము.. తప్పు చేస్తామంటే సహించేదేలేదని.. టెక్నాలజీ లేనప్పుడు ఎలాంటి వాటికి భయపడలేదు.. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తాము అన్నది మా ప్రభుత్వం చూపిస్తుంది అంటూ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్య కేసును ఇస్తామని చెప్పిన చంద్రబాబు అసలు  ఆ కేసుని పట్టించుకోవడంలేదనే విధంగా వార్తలు వినిపించాయి. మళ్లీ ఇన్ని రోజులకు  వైయస్ వివాహ హత్య గురించి స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: