
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి బాటలోనే పలువురు హీరోలు నడుస్తున్నారు. చిరు 25 ఏళ్ల క్రితమే ముందుగా చిరు ఛారిటబుల్ ట్రస్ట్ తరపున బ్లడ్ క్యాంపుల ద్వారా రక్త సేకరణ చేసి బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. ఆ తర్వాత చిరు ఐ బ్యాంక్ కూడా రన్ చేశారు. ఈ రెండిటి ద్వారా ఎంతో మంది రక్తం కావాల్సిన వారికి .. కళ్లు కావాల్సిన వారికి సాయం చేశారు. ఆ తర్వాత చిరుతో పాటు మరి కొందరు సీనియర్ హీరోలు చేస్తోన్న సేవా కార్యక్రమాల బాటలో ఎంతో మంది హీరోలు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరో కూడా తన వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తూ టాలీవుడ్ వర్గాలు.. సినీ అభిమానుల మనస్సులు గెలుచుకుంటున్నారు.
జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి. అటువంటి కృష్ణ జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ను పురస్కరించుకొని " సింధూర సంజీవని " పేరిట ప్రతి ఏటా జూన్ లో తన ఫ్రెండ్స్ తో బ్లడ్ డొనేషన్ చేయడానికి సంకల్పించారు. ఆ క్రమంలో భాగంగా జూన్ 29 ( రేపు ) చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. తనతో పాటు మరో పది మంది యువత బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు