ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు కూడా హీట్ మీదే ఉంటుంది.  మరీ ముఖ్యంగా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించిన తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వైసిపి అధికారులు వైసిపి నాయకులు ఎలా కూటమి ప్రభుత్వానిపై నిప్పులు చెరుగుతున్నారో మనం చూస్తూనే వస్తున్నాం . ఈ మధ్యకాలంలో వైసిపి నేతలు కూటమి ప్రభుత్వం పై మండిపడుతూ "నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేము వస్తే మేము అంటే ఏంటో చూపిస్తామంటూ" ఓపెన్గానే సవాలు విసిరారు. దీనికి రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు .


"మా అంతు చూడాలి అంటే మీరు మళ్ళీ రావాలి కదా .. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం " అంటూ ఓపెన్ గా సవాలు విసిరారు . "వైసీపీ మీద నాకేం కోపం లేదు.. కానీ మనుషులను భయపడితే అసలు ఊరుకోను ..మీకు 151 సీట్లు వచ్చినప్పుడు నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడే మిమ్మల్ని ఎదిరించా .. మనుషుల్ని భయపెట్టే చర్యలు చేపడితే అస్సలు ఊరుకోము "అంటూ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చాడు.  ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .



నరసింహపురంలో 12 ఎకరాల్లో 1290 కోట్లతో చేపట్టబోయే అతిపెద్ద తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు . ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు . అంతేకాదు ఈ నిర్మాణం పూర్తయితే 31 మండలాలలోని 1387 గ్రామాలకు నీటి కష్టాలు తొలగిపోతాయి.  అందుకే ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు డోల బాల వీరాంజనేయ స్వామి , ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . అంతేకాదు వెలుగొండ ప్రాజెక్టుకు దాదాపు 4 వేల కోట్లు కావాలి అని భూ పరిహారానికి కొంత మొత్తం కావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ మూమెంట్ లోనే వైసీపీ నేతలపై మండిపడుతూ "మనుషులను భయపెట్టే విధంగా మాట్లాడిన..  చర్యలు తీసుకున్న అస్సలు ఊరుకోమని మా అంతు చూడాలి అంటే అసలు మీరు అధికారంలోకి రావాలి కదా .. మీరు ఎలా వస్తారో మేము చూస్తామంటూ" ఓపెన్ గానే సవాల్ విసిరారు.  దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: