
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పైన విధివిధానాలను రూపొందించబోతున్నామని వాటిని ప్రభుత్వానికి సమర్పించిన తరువాతే ఇళ్ల స్థలాల పైన తగిన నిర్ణయం తీసుకుంటామంటూ కూటమి ప్రభుత్వం వెల్లడించింది. అయితే రెవెన్యూ శాఖ పనితీరు భూ సమస్యల పైన వస్తున్న కంప్లైంట్స్ వల్ల ప్రస్తుతం సీఎం చంద్రబాబు సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేశామని ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ పారదర్శకంగానే భూములు రీ సర్వే జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి కొత్త పాసుబుక్కులు వచ్చేలా చేస్తామంటూ వెల్లడించారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన సమస్యలు 4 లక్షలకు పైగా ఉన్నాయని అభ్యంతరం లేని భూములను సైతం పరిష్కరించడానికి జీవో 30 జరుగుతున్నదని తెలిపారు. సుపరిపాలనలో మొదటి అడుగు కార్యక్రమంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామంటూ తెలిపారు మంత్రి అనగాని సత్యప్రసాద్. హౌసింగ్ ఫర్ ఆల్ అనే అంశం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి రెండేళ్లలో ఇంటి స్థలాన్ని మూడేళ్లలోపు ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామంటూ తెలియజేశారు. పేదలకు జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలను అందించే విధంగా చూస్తున్నామని అందుకు సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామంటూ మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. ఏది ఏమైనా జర్నలిస్టులకు కూడా సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.