
ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కార్ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు కూడా తీసుకోవచ్చారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే FRS ను అమలు చేశారు. కృత్రిమ మేధా సాంకేతికతతో పనిచేసేటువంటి ఈ యాప్ ను 2023 సెప్టెంబర్ లోని రూపొందించారట. అయితే ఇందుకు సంబంధించి పరికరాలు ఏమీ ఉండవు కానీ కేవలం యాప్ తోనే హాజరు నమోదు చేస్తారు. 2023 సెప్టెంబర్ నుంచి విద్యార్థులకు వీటిని అమలు చేశారు. హెచ్ఎం లేదా ఉపాధ్యాయులు వద్ద ఉండేటువంటి స్మార్ట్ మొబైల్ తో విద్యార్థులు ముఖం వైపు చూపితే చాలు హాజరు అయ్యారా లేదా అనేది నమోదు అవుతుంది.
అయితే ఒకేసారి 15 నుంచి 20 మంది వైపు కూడా హాజరు అయ్యేలా ఇందులో చూపిస్తారు. ఇది విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్నం భోజనం పథకానికి ఉపయోగించేవారు. పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది నుంచి వీటిని ప్రయోగాత్మకంగా విద్యార్థులతో పాటు కొంతమంది ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరుని అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది పాఠశాల ప్రాంగణంలో ఉంటేనే టీచర్ కి హాజరు అయ్యారా లేదా అని పడే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి జీతాలు కూడా ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు మిగిలిన 32 జిల్లాలలో కూడా వీటిని అమలు చేసేలా చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొంతమంది ఉపాధ్యాయులు తమ బదులుగా విద్య వాలంటీర్లను నియమిస్తూ ఉండడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.