కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తాజాగా షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనే సమయం ఆసన్నమైందంటూ తెలియజేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత తన భవిష్యత్తు ప్లాన్ ఎలా ఉంటుందనే విషయం పైన కూడా తెలియజేశారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదువుతానంటూ వెల్లడించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం పైన కూడా ప్రత్యేకించి మరి దృష్టి పెడతానంటూ తెలిపారు అమిత్ షా.


గుజరాత్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో సైతం మాట్లాడుతూ ఈ విషయాలను తెలియజేశారు అమిత్ షా. రసాయన ఎరువులు వాడటం వల్ల పంటల నుంచి పండే వాటి ద్వారా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని.. అందుకే ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా ప్రయోజనాలు కలిగి ఉన్నాయని తెలిపారు. శరీరం వ్యాధులనుంచి దూరంగా ఉండేలా చూసుకోవాలని వ్యవసాయ ఉత్పాదకను పెంచడానికి కృషి చేస్తానంటూ తెలిపారు అమిత్ షా. సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందంటూ తెలిపారు.


తనకు హోం శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి చాలా కీలకమైన శాఖ ఇచ్చారని సహకారం మంత్రిగా బాధ్యతలు అప్పగించినప్పుడు హోం శాఖ కంటే మరింత ఎక్కువ పెద్ద శాక ఇచ్చారనే విధంగా తాను భావించానని.. విశాఖ వల్ల దేశంలో రైతులు పేదలు పశుసంపదన గ్రామాల కోసమే పని చేస్తుందంటూ తెలియజేశారు అమిత్ షా. కానీ రిటైర్మెంట్ ఎప్పుడైనా విషయాన్ని మాత్రం ప్రకటించలేదు అమిత్ షా. సహకార మంత్రిగా 2021 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014 బిజెపి జాతీయ అధ్యక్షుడిగా మోదీ ప్రధానమంత్రిగా తిరగడానికి కీలకమైన ఆ వ్యక్తిగా నిలిచారు.. ప్రధాన మోడీతో అమిత్ షాకు చాలా బలమైన అనుబంధం ఉన్నది. ఆ తరువాత 2019 లోక్సభ విజయంలో కూడా కీలకమైన పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: