
కాని చివరికి ఇదంతా కూడా ఒక బూటకం అన్నట్లుగా అధికారులు తేల్చి చెబుతున్నారు. కానీ మెయిల్ ఎవరు పంపించారు అనే విషయం మాత్రం ఇంకా అధికారులు గుర్తించలేకపోతున్నారు. డాగ్, బాంబు స్క్వాడ్లతో చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి సోదాలు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు అధికారులు. కానీ అక్కడ అనుమానాస్పదంగా ఎలాంటివి కనిపించలేదని తెలియజేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం విజయన్, ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా విదేశాలలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను సైతం లక్ష్యంగా చేసుకొని మరి ఇలాంటి ఈ మెయిల్స్ పంపిస్తూ కొంతమంది బెదిరిస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు.
అందుకు సంబంధించి అలాంటి కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఎవరు చేసినా కూడా సహించేది లేదని కచ్చితంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కేరళ ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇక నేతలు కూడా ప్రతి ఒక్కరు అన్ని విషయాలలో అలర్టుగా ఉండాలంటు అధికారులను హెచ్చరిస్తున్నారు. 2018లో ఉత్తమ ముఖ్యమంత్రిగా కూడా గాంధీ దర్శన అవార్డుని అందుకున్నారు. 2018లో నిపా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించినందుకు గాను మరొకసారి కేరళ సీఎంని సత్కరించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ అన్ని సదుపాయాలని ప్రజలకి సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కేరళ సీఎం.