
రెడ్డి సామాజిక వర్గంపై ప్రభావం :
మిథున్ రెడ్డి అరెస్టును రెడ్డి సామాజిక వర్గంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా, లేదా చంద్రబాబు రెడ్డి సామాజిక వర్గాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీలోని ఓ వర్గం నాయకులు ఆరోపించినా, అది రెడ్డి సామాజిక వర్గంపై పెద్దగా ప్రభావం చూపలేదు. రెడ్డి సామాజిక వర్గం దీనిని తమపై జరిగిన దాడిగా లేదా తమ వర్గాన్ని అణచివేసే ప్రయత్నంగా భావించడం లేదు. వారు ఈ కేసును కేవలం ఒక కేసుగానే చూస్తున్నారు. అంటే, వైసీపీ ఆశించినట్టుగా రెడ్ల పోలరైజేషన్ జరగలేదు. ఇది వైసీపీకి ముఖ్యంగా ఆశించిన సామాజిక మద్దతు లభించకపోవడాన్ని స్పష్టం చేస్తుంది. చిత్తూరు సహా సీమ రాజకీయాల్లో మిథున్ రెడ్డి అరెస్టుతో ఎలాంటి ప్రత్యేక సానుభూతి రాలేదని పరిశీలకులు చెబుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని సమర్థించే నలుగురు నాయకులు మినహా ఈ పరిణామంతో పెద్దగా సానుభూతి లభించలేదు. ఇది వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. పుంగనూరులో బోడే రామచంద్ర సహా టీడీపీ నాయకులు మిథున్ రెడ్డి అరెస్టుపై సంబరాలు చేసుకోవడం గమనార్హం. పెద్దిరెడ్డిని సమర్థించేవారు కూడా పెద్దగా స్పందించకపోవడం వైసీపీకి ఆందోళన కలిగించే అంశం.
ఓవరాల్‌గా చూసుకుంటే, మిథున్ రెడ్డి అరెస్టు వైసీపీకి ఎటువంటి సానుకూలతను తీసుకురాలేదు. పార్టీలో అంతర్గత ఐక్యత లోపించడం, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం, సీమ రాజకీయాల్లో సానుభూతి రాకపోవడం వంటి అంశాలు వైసీపీకి నష్టంగానే పరిగణించబడతాయి. ఈ పరిణామం పార్టీ భవిష్యత్తు రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.