
గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పంచాయతీ ఎన్నికలలో నిలబడడానికి అనర్హులుగా చట్టం ఉండేది. కానీ ఇప్పుడు వాటిని సవరిస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయవచ్చు అనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఏపీలో ఎక్కువమంది జనాభా ఉండేలా గట్టిగానే అందుకోసం కసరత్తులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ముగ్గురు పిల్లలు కంటే ఆస్తి పన్ను మినహాయింపు ఉంటుందని తెలుపుతోంది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా సంతాన ఉత్పత్తి కోసం ఆంధ్రప్రదేశ్లో 12 శాతం మంది దంపతులు ఇబ్బంది పడుతున్నారని వారికి IVF చికిత్స కోసం అయ్యే ఖర్చును కూడా ఏపీ ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నదట.
అలాగే మాతృత్వ సెలవులను కూడా ఏడాది వరకు పెంచాలనే నిర్ణయం తీసుకోబోతోంది కూటమి ప్రభుత్వం. మూడో బిడ్డ కంటే వారికి రూ .50 వేల రూపాయలు ఇవ్వబోతున్నారట. నాలుగో బిడ్డని కంటే ఇదేవిధంగా ప్రభుత్వమే సొమ్మును చెల్లిస్తారట. ఇదే కాకుండా మరికొన్ని సదుపాయాలను అందించేలా ప్లాన్ చేస్తున్నారు.ఏపీలో ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలను తీసుకోబోతోంది. గతంలో 2.1 గా ఉన్న సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.5 కి పడిపోయిందని ఇదే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి ఇక ఏపీలో వృద్ధులు తప్ప మరెవరు ఉండరని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.