
ఇక వెంటనే పార్టీ మారి బీజేపీలోకి వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయనకు గాలి అనుకూలంగా వీచలేదు. బీజేపీ ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ, జైత్రయాత్ర జరగలేదు. ఓటమి ఎప్పటికీ మర్చిపోలేనిది అయిపోయింది. ఈ ఓటమితో నల్లారి పూర్తిగా వెనక్కు వెళ్లిపోయారు. బీజేపీలో ఉన్నా.. కనపడని లీడర్‌గా మారిన నల్లారి: ఇప్పుడు నల్లారి పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే నేతగా ఉండడం లేదు. రాజ్యసభలోనైనా అవకాశం వస్తుందేమో అన్న ఆశలు కూడా కొల్లగొట్టాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు కొత్తవారికి పదవుల మీద మొగ్గు చూపడం లేదు. పైగా గతంలోనే ఎంపీ టికెట్ ఇచ్చినందున మరొక అవకాశం కల్పించే ఉద్దేశం కూడా లేదన్న వార్తలున్నాయి. దీంతో నల్లారి పార్టీపై ఆసక్తి చూపినా, పూర్తిస్థాయిలో పాలుపంచుకునే స్థితిలో లేరు.
హైదరాబాద్‌కే పరిమితమైన నేతగా మారిపోయారు: అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ... ఇప్పుడు హైదరాబాద్ నివాసం నుంచే బీజేపీ కార్యకలాపాలపై చిన్న దృష్టి ఉంచుతున్నారంతే. రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడానికీ ఆయన ఆసక్తి చూపడం లేదు. పదవిలేకపోవడంతో పాటు భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో నల్లారి మౌనాన్ని ఎంచుకున్నారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పే టైమా..?.. నల్లారి సన్నిహితులు కూడా ఇక రాజకీయాలకు వీడ్కోలు పలకమని సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పదవిలేని పదేళ్లు, రాజకీయ స్పేస్ దక్కకపోవడం, కేంద్రం దృష్టిలో పడకపోవడం – ఇవన్నీ కలిసొచ్చిన సమయంలో నల్లారి ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉండటమే ఆయన్ని ప్రజలకు దూరం చేస్తోంది. తుది గమ్యం ఏమైనా… kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ‘ఓ టైటిల్ లెస్ లీడర్’గానే మిగిలిపోయారు.