
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల వేలాది మంది ఆటో డ్రైవర్లు నష్టపోతారంటూ గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇటీవలే మంత్రి కొల్లు రవీంద్ర పర్యటిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతున్నామంటూ తెలియజేశారు. ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏడాది పదివేల రూపాయలు చొప్పున అందిస్తామంటూ తెలియజేశారు.
అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేళలో 7000 రూపాయలను త్వరలోనే జమ చేయబోతున్నామని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ .10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి అంటు తెలియజేశారు. ఉచిత బస్సు పథకాన్ని మహిళలకు ఆగస్టు 15 నుంచి మొదలు పెట్టబోతున్నామని ఆర్టీసీ బస్సులో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేల అవకాశం ఇస్తారా? లేకపోతే జిల్లాల పరిధిలోకేనా అన్న విషయం ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గతంలో వైసిపి ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్ల పరిస్థితులను గుర్తించి వాహన మిత్ర పథకం కింద ప్రతి ఏడాది పదివేల రూపాయలు అందించేవారు. ఇప్పుడు అదే పద్ధతిని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించేలా ప్లాన్ చేస్తోంది.