ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అండతో కొంతమంది నేతలు రెచ్చిపోయి మరి ప్రవర్తిస్తున్న సంఘటనలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఒక మంత్రి బంధువు ఏకంగా పోలీస్ అధికారి పైన దౌర్జన్యంగా చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో చోటు చేసుకున్నది. ఏపీ భవనాల, రోడ్లు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయినా సోదరుడు బి.మదన్ భూపాల్ రెడ్డి తన  అనుచరులతో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు.



అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ జస్వంత్ ఆలయంలోనికి పంపడం అసాధ్యం అంటూ మదన్ భూపాల్ రెడ్డి ని అతను అనుచరులను ఆపారు. దీంతో ఈ విషయంపై మంత్రి సోదరుడు కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కానిస్టేబుల్ పైన చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో తాజాగా ఈ విషయం పైన బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైరల్ గా మారుతున్నది.


బీసీ జనార్దన్ రెడ్డి ఇలా స్టేట్మెంట్ ఇస్తూ.. కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణలో భాగంగా నిన్నటి రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి కుంబాభిషేకంలో పాల్గొన్నామని. అయితే ఈ సందర్భంగా జరిగిన అక్కడ వివాదం పైన చింతిస్తున్నాను.. ఆలయం వద్ద విధులలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ పైన చేయి చేసుకోవడం వంటి విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ విషయం తెలిసిన వెంటనే ఈ దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలను జారీ చేశానని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎలాంటి తావు లేదని తెలియజేస్తూ ఒక లెటర్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: