
కారణం … అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన “టారిఫ్ బాంబ్!” గురువారం నుంచే అమెరికా దిగుమతులపై 25% అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇది కేవలం స్టీల్ లేదా అల్యూమినియం మాత్రమే కాదు, చేనేత రంగం, బంగారం, వజ్రాల పరిశ్రమలపై కూడా భారీ షాక్ ఇవ్వబోతోంది. దీని ప్రభావం నేరుగా భారత ఎగుమతులపై పడనుంది. అందుకే మోడీ తక్షణమే కేబినెట్‌ను సేకరించి, ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కోవాలో చర్చించటం ప్రారంభించారు. ఎగుమతులపై సుంకం పెరిగితే ఎవరికి ఎఫెక్ట్? చాలామందికి ఇది కన్‌ఫ్యూజన్. సింపుల్‌గా చెప్పాలంటే … అమెరికా సుంకం పెంచితే అక్కడి వ్యాపారులు కాదు, భారత్ నుంచి ఎగుమతి చేసే మన వ్యాపారులే ఆ డబ్బు చెల్లించాలి. అంటే వస్తువుల ధర పెరిగి, అమెరికా మార్కెట్‌లో మన ప్రొడక్ట్స్ కాంపిటీషన్ తగ్గిపోతుంది.
ఉదాహరణకి – ఇప్పటివరకు అమెరికాలో ఒక భారత బ్రాండ్ వస్తువు 10 రూపాయలకు లభిస్తే, కొత్త సుంకం వల్ల అది 12–13 రూపాయలకే దొరుకుతుంది. దీంతో అక్కడి కొనుగోలు తగ్గిపోతుంది. మోడీ మీటింగ్‌లో వాణిజ్య సంబంధాల్లో పెరిగిన ఈ ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపక్ష విమర్శలు అన్నీ చర్చకు వచ్చాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధానికి వెళ్లాలా? లేక డిప్లొమాటిక్‌గా వ్యవహరించాలా? అనే క్రూషియల్ నిర్ణయాలపై చర్చ సాగింది. ట్రంప్ టారిఫ్ బాంబ్ భారత్‌పై ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేకపోయినా… ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత దేశ ఆర్థిక వ్యూహంలో పెద్ద మార్పులు రావడం ఖాయం!