
ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలపై బూతులు, వ్యక్తిగత విమర్శలు విసిరి వివాదాలకు కేంద్రబిందువయ్యారు. వారి వ్యక్తిగత ఇమేజ్ కూడా దెబ్బతింది. ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఇది కూడా ఓ ప్రధాన కారణమైంది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే పార్టీ ఓటమి తర్వాత ఏడాదిన్నర గడిచినా, ఈ నేతలు ఎవరు కూడా ప్రజల్లోకి రాలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లు అప్పుడప్పుడు ముందుకొస్తున్నా ఆయనపై గనుల కేసు నమోదవడంతో మళ్లీ మౌనం వహించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో ఇప్పటివరకు పెద్దగా కేసులు నమోదు కాలేదు కానీ బియ్యం అక్రమ రవాణా కేసులు ఎదురు చూస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక కొడాలి నాని విషయానికి వస్తే ఆయనపై ఇప్పటికే అనేక కేసులు ఉండటంతో మరింత ఇబ్బందులు తప్పడం కష్టమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కూడా వీరిని బలవంతంగా ముందుకు రమ్మని అడగడం లేదు. జగన్ కూడా "ప్రజల్లోకి వెళ్లండి, పార్టీ తరఫున స్పందించండి" అని సూచించకపోవడం గమనార్హం. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్లుగా మారిన వీరు, ఇప్పుడు పూర్తిగా నేపథ్యంలోకి వెళ్లిపోయారు. వచ్చే మూడు సంవత్సరాల వరకు అయినా వీరి పరిస్థితి ఇలాగే ఉండనుంది. ఏదేమైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్‌బ్రాండ్లుగా ఉన్న వాళ్లు ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే సైలెన్స్ అయిపోయారు.