ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా జనసేన పార్టీ చాలా కీలకంగా ఉంది. జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యమైన మీటింగ్ నిన్నటి రోజు నుంచి ప్రారంభమై మూడు రోజులు జరగబోతుంది. నిన్నటి రోజున కొంతమంది ఎమ్మెల్యేలతో పాటుగా కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జిల ప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు లోక్సభ నియోజకవర్గాల వారిగా కీలకమైన నేతలతో కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రేపటి రోజున పబ్లిక్ మీటింగ్ తో కనీసం ఒక 15,000 మందితో కార్యకర్తలతో ప్లాన్ చేశారు.


పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల అక్కడక్కడ కూటమికి కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కార్యకర్తలలో , నేతల మధ్య కొంత అసంతృప్తి ఉందని.. కొంత ప్రయారిటీ తగ్గిందనే భావన చాలామందిలో ఉన్నదట. వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి అలాగే ఎమ్మెల్యేల వ్యవహారాలను సరి చేయడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే పొత్తు కూడా మరో 15 ఏళ్ల పాటు ఉంటుంది.. కాబట్టి అందుకు తగ్గట్టుగానే నేతలు పనిచేయవలసి ఉంటుందని చెప్పడానికే స్పష్టమైన సంకేతం ఇవ్వడానికి ఈ మీటింగ్ అన్నట్లుగా వినిపిస్తున్నాయి.



ఎన్నో సందర్భాలలో ఈ పొత్తు 15 ఏళ్లు ఉంటుందని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా ఈ మూడు రోజులు జరిగే మీటింగ్లో కూడా చెబుతున్నట్లు వినిపిస్తున్నాయి.  కూటమి 15 ఏళ్ల పాటు ఎందుకు ఉండాలి అంటే.. రాష్ట్రాన్ని ఒక దశలో నిలబెట్టాలి అంటే పొత్తు ఉండాల్సిందేనని.. ఒకవేళ పొత్తు విడిపోతే ఖచ్చితంగా మళ్ళీ వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఐదేళ్లు పడిన శ్రమ వెనక్కి వెళ్ళిపోతుందని భావనతోనే పొత్తు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. రాజధాని, పోలవరం ఇతర పరిశ్రమల ప్రాజెక్టుల విషయంలో కూడా మళ్లీ వెనక్కి వెళ్లిపోతాయని ఆలోచనతోనే  2029 లో కూడా పోత్తుకి సిద్ధమయ్యారు జనసేన పార్టీ.


అయితే ఈసారి ఎన్నికలలో జనసేన పార్టీకి కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈమధ్య వైసీపీ పార్టీ కూడా వ్యూహాన్ని మార్చింది.. గతంలో చేసినట్లుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ ఇప్పుడు చేయడం లేదు. భవిష్యత్తులో టిడిపి, జనసేన విడిపోతే.. వైసిపి పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందనే ఆశతో వైసీపీలో చాలామంది కాపు నేతలలో ఉన్నదట. ఒకవేళ 2029 ఎన్నికల నాటికి కూటమిలో చిచ్చు వచ్చి విడిపోతే జనసేన పార్టీతో వైసిపి పొత్తు పెట్టుకొనే ఆలోచనలో ఉందన్నట్లు వినిపిస్తున్నాయి.


 2019 ఎన్నికలలో కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారని గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.. జనసేన పార్టీ విషయంపై జగన్ కు ఒక క్లారిటీ ఉంది.  2019లో జగన్మోహన్ రెడ్డి అంతగా గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్.. సుమారుగా 35 నియోజకవర్గాలలో టిడిపి పార్టీని ఓడిపోయేలా చేశారు. 2024లో కూడా కూటమి  అంత భారీగా గెలవడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్.. రాష్ట్ర రాజకీయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉన్నది.. వైసిపి కూడా వారి యొక్క వ్యూహరచనతోనే ఉన్నది. వాళ్లు 15 ఏళ్లు పోత్తులో ఉంటారు. ఒకవేళ వాళ్లలో వాళ్లకు విభేదాలు వస్తే పవన్ కళ్యాణ్ గారిని హక్కును చేర్చుకుందాం అనే ధోరణిలో వైసిపి ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. పోత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయకూడదనే విషయంలో ఉన్నట్టుగా వైసీపీ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: