ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం కుర్చీని  అధిరోహించారో అప్పటినుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర అనేక నిధులు, పనులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాలు, రైల్వే ప్రాజెక్టులు, రోడ్లు, నూతన భవనాలు ఇలా ఒక్కటేమిటి అనేక పనులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్ హబ్ గా మార్చాలనే ఆశయంతో జాతీయ రహదారుల విస్తరణ పనులు స్పీడుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్నూల్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా  బయటకు వచ్చింది. కర్నూల్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం కోసమే ఓఆర్ఆర్ నిర్మాణానికి  అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. 

అయితే తాజాగా కర్నూల్ నగరపాలక సంస్థ సార్వసభ్య  సమావేశం నిర్వహించి ఓఆర్ఆర్ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని, ఆ ప్రతిని ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అనేది పెద్దపాడు, హైదరాబాద్ మరియు జాతీయ రహదారిని అనుసంధానించేలా ప్రతిపాదన చేస్తున్నారు. కర్నూలు నగరానికి సంబంధించి ట్రాఫిక్ రద్దీ అనేది ఓ సమస్యగా మారిపోయిన తరుణంలో ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బళ్లారి రోడ్డు జంక్షన్ లో  నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. పెదపాడు నుంచి వచ్చే ఏ వాహనాలు అయినా సరే బెంగుళూరు లేదంటే హైదరాబాద్ వైపు వెళ్లేందుకు జాతీయ రహదారిలోకి ప్రవేశించడానికి బళ్లారి చౌరస్తా గుండా వెళ్లాల్సి ఉండేది. దీనివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాం సమస్యలు ఏర్పడేవి.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం దానికి పరిష్కారం మార్గం చూపాలని  గతంలో మంత్రి టీజీ భరత్ ఒక ప్రతిపాదన చేశారు. హైదరాబాద్ రోడ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు చిన్న బైపాస్ ద్వారా లూప్ రోడ్డు వేయాలని ప్రణాళికలు సిద్ధం చేయించారు. కానీ దీని ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని భావించిన ఈ ప్రభుత్వం కర్నూలు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణమే ట్రాఫిక్ ను పరిష్కరిస్తుందని తెలియజేశారు. అయితే దీనికి కర్నూలు నగరపాలక సంస్థ సర్వే సమావేశంలో ప్రతిపాదనలు త్వరగా తీసుకువచ్చి ప్రభుత్వానికి పంపితే పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కొత్త ఔటర్ రింగ్ రోడ్ కోసం కర్నూలు నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన తర్వాతే ఈ  రోడ్ల నిర్మాణాలు స్పీడప్ అవుతున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ డెవలప్మెంట్ లో దూసుకుపోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: