సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలు, జనసేన పార్టీకి సంబంధించి అన్ని పనులను కూడా చక్కపెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఓజి సినిమా రేపటి రోజున రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఆదివారం రోజున జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు. అక్కడికి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రావడమే కాకుండా హైలెట్గా నిలిచారు. ఆ మరుసటి రోజునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ పనులలో బిజీగా మారిపోయారు. అలాగే అసెంబ్లీ సమావేశాలలో కూడా పాల్గొన్న పవన్ కళ్యాణ్ తాజాగా వైరల్ ఫీవర్ బారిన పడ్డట్టుగా వినిపిస్తున్నాయి.


గడచిన రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నారని అయినప్పటికీ కూడా సోమవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిసింది .అధికారులతో అన్ని విషయాలను చర్చించి వెళ్లిన తర్వాత తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ వెంటనే వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించగా వైద్యులు సైతం విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. అలా ఒకపక్క జ్వరంతో బాధపడుతూనే తన శాఖపరమైన విషయాల పైన టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పి.ఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ట్వీట్ వైరల్ అవుతోంది.


ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతూనే మరొకపక్క ఓజి సినిమా రిలీజ్ అవుతూ ఉండగా.. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడటంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.  అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరో కొద్ది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి మరి ఆ అసెంబ్లీ సమావేశాలకు పవన్ కళ్యాణ్  వెళ్తారో లేదో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: