తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులది మాత్రమే నడిచింది. అంతేకాదు కేసీఆర్ కూడా తనకు నచ్చినట్టు పాలన చేశారు. ఎవరికి భయపడకుండా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా అరెస్టు చేయించారు. అంతటి దైర్యం కలిగినటువంటి కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇదే తరుణంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ వంటి కేసులను బయటకు తీసుకువచ్చింది. ఈ కేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయిస్తానని చెబుతోంది. మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అవుతారా ఆ వివరాలు చూద్దాం.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తర్వాత చంద్రబాబు ద్వారా ఆ వివాదం నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

కష్టమైన, నష్టమైనా ఆ పార్టీలోనే ఉండి చివరికి జైలు పాలై, వర్కింగ్ ప్రెసిడెంట్ గా  చేసి ఆ తర్వాత టిపిసిసి అయి చివరికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అక్కడితో కూడా ఆగకుండా తానే సీఎం కూడా అయ్యారు. ఆయన అధికారంలోకి రాకముందే శపథం చేశారు. తప్పకుండా కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేసి, అవినీతి బయట పెడతానన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వారిని ఒక్క రోజు కూడా జైలుకు పంపించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చారు. కానీ వారిని అరెస్టు చేసి ప్రతీకారం తీర్చుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదు.

వివిధ కమీషన్ల పేరుతో కాలయాపన చేసి చివరికి ఆ కేసును  కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు. అంతే కాకుండా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి గవర్నర్ ఓకే చెప్తే తప్పకుండా కేటీఆర్ ను అరెస్టు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. దసరా తర్వాత కేటీఆర్ తప్పకుండా జైలుకు వెళ్తారని ఆయన అన్నారు. మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అవుతారా.. అరెస్టు చేయించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి..కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఓవైపు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వారిని కోర్టు మెట్లు కూడా ఎక్కించిన దాఖలాలు లేవని కొంతమంది మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: