జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రత్యర్థుల పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్.. గెలుపుకు అన్ని వంతులు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక వ్యూహాలు, అంచనాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తప్పనిసరిగా జరగాల్సి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గోపీనాథ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ప్రచారంలో ఇప్పటికే బీఆర్ఎస్ ముమ్మరంగా నడుస్తున్నా, ఇప్పుడు పార్టీకి కొత్త సవాలు ఎదురైంది. జూబ్లీహిల్స్ బరిలో తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్ (టీఆర్ఎస్-డి) పార్టీ ప్రవేశించింది.
 

టీఆర్ఎస్-డి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ శనివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో పార్టీ జెండా, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లోగో రూపకల్పన చేశామని తెలిపారు. పార్టీ జెండా తెలంగాణ ప్రతిబింబం అని చెప్పారు. టీఆర్ఎస్-డి జూబ్లీహిల్స్ అభ్యర్థిగా కంచర్ల మంజూషను నిలిపి, బలమైన పోటీ ఇస్తామని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీకి ఇది మరో సవాలు. టీఆర్ఎస్-డి జెండా, పేరు బీఆర్ఎస్‌కు చాలా దగ్గరగా ఉండటం, గులాబీ రంగుతో పోలిక, ఓటర్లలో తికమకం సృష్టించే అవకాశం ఉంది.



గతంలో స్వతంత్ర అభ్యర్థులు కారును పోలిన రోడ్డు రోలర్, రోటీ మేకర్‌ వంటి గుర్తులతో బరిలోకి దిగితే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌కి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా టీఆర్ఎస్-డి గల అభ్యర్థి బరిలోకి రావడం, బీఎరస్‌కు వ్యతిరేకంగా ఓట్లు చీలే అవకాశం కలిగిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ కొత్త పార్టీ ప్రభావం బీఆర్ఎస్ ఓటు నష్టం చేస్తుందా అని అంచనా వేస్తున్నారు.ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్-డి మూడు వైపులా గట్టి పోటీ, వ్యూహాలు, టెన్షన్.. మాస్‌ లెవెల్ రాజకీయం ఊహించలేని మలుపులు తిప్పేలా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఈ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అలాగే ఎవరు గెలుస్తారు అనేది కూడా  ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: