తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈయన పేరే హాట్ టాపిక్ గా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వేం నరేందర్ రెడ్డి ఎవరో కాదు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. వీరిద్దరి స్నేహం టిడిపిలో ఉన్నప్పటినుండే కొనసాగుతోంది.అప్పటి స్నేహబంధం ఇప్పటికి కూడా అలాగే ఉంది. అయితే అలాంటి వీరి మధ్య ఉన్న బంధం వల్ల రేవంత్ రెడ్డి కుర్చీకే ఆటంకం ఏర్పడుతుందట. ఎందుకంటే తాజాగా కొండా సురేఖ వ్యవహారంలో వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరిపినప్పటికీ అందులో కీలక శాఖలు అయినటువంటి హోంశాఖ ని ఎవరికీ కేటాయించలేదు. హోం శాఖ ఇంకా రేవంత్ రెడ్డి వద్దే ఉంది. అయితే రేవంత్ రెడ్డి వద్ద హోమ్ శాఖ ఉన్నప్పటికీ దానికి అనధికారిక హోం మంత్రిగా వేం నరేందర్ రెడ్డి పనిచేస్తున్నట్టు అర్థం అవుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరికి ఏ జాబ్ కావాలన్నా..ఎవరికి ఏ పోలీస్ ఉద్యోగం ఇవ్వాలన్నా అదంతా వేం నరేందర్ రెడ్డి చేతుల్లోనే ఉందట.. 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి 12 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇక ఈ ఏడాది జూన్లో మంత్రివర్గంలోకి మరో ముగ్గురికి ఛాన్స్ కల్పించారు. అలా తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. కానీ విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,హోమ్ శాఖ, పట్టణ అభివృద్ధి శాఖ వంటి కీలక శాఖలన్నీ కూడా ఇంకా రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ శాఖలు ఏ మంత్రికి కూడా కేటాయించలేదు.ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి  డిసెంబర్ తో 2 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి.అలా గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలైనా కూడా ఇంకా లా అండ్ ఆర్డర్ లో కీలకమైనటువంటి హోం శాఖను ఏ మంత్రికి కూడా కేటాయించకపోవడం పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సీఎం వద్ద హోమ్ శాఖ ఉన్నప్పటికీ అనధికారిక హోం మంత్రిగా షాడో హోమ్ మినిస్టర్ గా వేం నరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఇంటికి ఏకంగా పోలీసులను పంపించారంటే అదంతా వేం నరేందర్ రెడ్డి పనేనని, ఆయన షాడో హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు రాష్ట్రంలో హోంశాఖ ఎవరికి కేటాయించకపోవడం వల్ల శాంతిభద్రతలు అదుపులో లేవని, రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని,పోలీసులకే రక్షణ కరువైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. పట్టపగలే ఓ రౌడీ షీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని హత్య చేశాడు ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. షాడో హోమ్ మినిస్టర్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిల బంధం గురించి పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాదు వేం నరేందర్ రెడ్డి చేసే ఈ చర్యల కారణంగా రేవంత్ రెడ్డి సీట్ కే ఎసరు పెడుతున్నారని,సీఎం తన స్నేహితుడు అనే కారణంతో వేం నరేందర్ రెడ్డి కి ఫుల్ రైట్స్ ఇచ్చేశారని, అందుకే ఇలా వేం నరేందర్ రెడ్డి రెచ్చిపోయి తానే హోంశాఖ మంత్రిగా ప్రవర్తిస్తున్నాడని ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది.మరి ఈ షాడో హోమ్ మినిస్టర్ కథను రేవంత్ రెడ్డి సమాప్తం చేస్తారా.. లేక వేం నరేందర్ రెడ్డి తో స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేసి షాడో హోమ్ మినిస్టర్ కుర్చీ లో ఆయన్ని కూర్చోబెట్టి సీఎం తన కుర్చీకి ఎసరు పెట్టుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: