
మొదటి దశలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కలిసి 800 మిలియన్ డాలర్లు చొప్పున, మొత్తం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) సాయం అందించేందుకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, ఈ ఏడాది మార్చిలో వరల్డ్ బ్యాంక్ తొలి విడతగా 207 మిలియన్ డాలర్లు ఇప్పటికే విడుదల చేసింది. ఆ నిధులలో దాదాపు 50 శాతం మేర వివిధ మౌలిక వసతుల పనులకు వినియోగించారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ తెలిపారు. ప్రపంచ బ్యాంక్ నిబంధనల ప్రకారం తొలి విడత నిధులలో 75 శాతం ఖర్చు చేసిన తరువాతే రెండో విడతకు అర్హత లభిస్తుంది. ఆ లక్ష్యాన్ని డిసెంబర్ నాటికి చేరుకుంటామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 1400 కోట్లను తన వాటాగా ఇవ్వడానికి అంగీకరించింది. అమరావతి ప్రాజెక్ట్ పురోగతిపై వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ నివేదికలో కూడా “ప్రాజెక్ట్ అమలు తీరుపై సంతృప్తి” వ్యక్తమైంది. దీంతో రెండో విడత నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. చమొత్తం మీద, ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధి దిశగా కీలక మలుపుగా మారనుంది. రాజధాని పనులు మళ్లీ ఊపందుకోవడంతో ప్రజల్లో ఆశలు పుడుతున్నాయి. “ప్రపంచ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్‌తో అమరావతి కల మళ్లీ చెల్లుబాటయ్యే దిశలో అడుగులు వేస్తోంది” అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.