కర్నూలు సమీపంలో శుక్రవారం రోజు తెల్లవారుజామున కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.ఇందులో సుమారుగా 19 మంది పైగా మరణించారు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదంపై ఇప్పటివరకు ఏవేవో వార్తలు వినిపించాయి. ముఖ్యంగా బైకు తోలుతున్న యువకుడి (శివశంకర్) బైక్ బస్సు ఢీ కొనడంతో బైక్ బస్సు డీజిల్ ట్యాంక్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని వినిపించాయి. కానీ డ్రైవర్ వాదన మాత్రం అక్కడ ఆల్రెడీ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ యువకుడిని (శివశంకర్) ను యాక్సిడెంట్ చేశారని ఆ యువకుడు రోడ్డుకి అటు సైడు పడిపోయారు, బైక్ మాత్రం రోడ్డు మధ్యలో ఉన్నది. ఆ బైకు దగ్గర వచ్చే వరకు కనిపించలేదు, బ్రేకులు వేస్తున్నప్పటికీ లోపల ప్రయాణికులకు ప్రమాదమని గుర్తించి బైకు మీద ఎక్కించారని అప్పుడే ఈ ప్రమాదం జరిగిందంటూ తెలుపుతున్నారు.


అయితే ఇప్పుడు తాజాగా బైకు నడిపిన శివశంకర్ కి సంబంధించి సీసీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదం జరగడానికి ముందు బైకర్ పెట్రోల్ బంక్ లోకి ప్రవేశించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తోంది. శివశంకర్ తో పాటు మరొక యువకుడు కూడా ఆ వాహనంలో కనిపించారు. అయితే ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నారని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. పెట్రోల్ బంకు సిబ్బంది పైన కేకలు వేసిన పిలవడం వంటివి చేశారని, పెట్రోల్ బంకులో స్తంభాల మధ్య బైకును తిప్పుతూ ఉన్నట్లుగా సిసి ఫుటేజీలో వైరల్ గా మారుతున్నాయి. మద్యం మత్తులో  బైక్ కొన్నిసార్లు స్కిడ్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది.



వీటికి తోడు తెల్లవారుజామున 2:22 నిమిషాలకు పెట్రోల్ బంకులో శివశంకర్ ఉండగా ఈ ప్రమాదం 2:40 నిమిషాలకు జరిగినట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బస్సు నడిపింది డ్రైవర్ కాదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఘటన జరిగినప్పుడు క్లీనర్ డ్రైవింగ్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. డ్రైవర్ చదివింది ఐదవ తరగతి అయినప్పటికీ తప్పుడు పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ పొందారని వినిపిస్తున్నాయి. మరి ఈ ఘటన పైన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: