నాలుగు ఓటములు… కానీ ఒక్కసారి కూడా వదిలేయలేదు! .. నియోజకవర్గంపై ఆయనకున్న నిబద్ధత, ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఆయనను తిరిగి తిరిగి బరిలోకి దిగేలా చేసింది. జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకం గెలుచుకోవాలంటే సేవ చేయాలని భావించిన నవీన్ యాదవ్ — ‘నవ యువ ఫౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో గెలవాలంటే ముందు ప్రజల గుండెల్లో చోటు దక్కాలని ఆయన అర్థం చేసుకున్నారు. కీలక మలుపు - కాంగ్రెస్‌లో చేరిక.. 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్… ఇదే ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం - 16 ఏళ్ల పోరాటానికి దారులు మార్చింది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆయనకే టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఉపఎన్నికలో దూకుడే దూకుడు! 8 రౌండ్లు పూర్తయ్యే సరికి 20 వేల మెజార్టీ దాటేసిన నవీన్ యాదవ్ - జూబ్లీహిల్స్‌ను గెలుపు దిశగా దూసుకెళ్లారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని అన్ని రౌండ్‌లలోనూ వెనక్కు నెట్టి రాజకీయాల్లో ‘కన్‌సిస్టెన్సీ’ అంటే ఇదే అనిపించారు. నియోజకవర్గంలో దశాబ్దాలపాటు చేసిన శ్రమ, ప్రజల మధ్య గడిపిన సమయం, సేవా కార్యక్రమాలు - ఇవన్నీ ఈ రోజు ఆయన గెలుపు పటాకా అవుతున్నాయి. ఓటములను మెట్లుగా మార్చుకుని… చివరకు విజయం శిఖరానికి చేరిన నాయకుడు - నవీన్ యాదవ్! జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఈసారి ఆయనకే స్పష్టంగా జనాధికారాన్ని అందించారు. 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం… నాలుగు వరుస ఓటములు… కానీ చివరికి అరుదైన చారిత్రక గెలుపు. ఇదే నవీన్ యాదవ్ గాథ!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి